శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు నటుడు, హీరో శోభన్ బాబు( Sobhan Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఎన్ని తరాలు మారినా, ఎంత మంది హీరోలు వచ్చినా కూడా ఎప్పటికి సోగ్గాడే శోభన్ బాబు.
అమ్మాయిల గ్రీకు వీరుడు శోభన్ బాబు.పేద, మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు.
నాటకాల ద్వారా నటన పై ఆసక్తి పెంచుకుని, సినిమాల్లోకి వచ్చాడు.వరుసగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనని తాను ఆవిష్కరించుకున్నాడు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎదుగుతూ వచ్చారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ మెప్పించాడు, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు.
నెమ్మదిగా హీరోగా ఎదిగాడు. """/" /
తిరుగులేని స్టార్‌గా నిలబడ్డాడు.
కానీ ప్రారంభంలో శోభన్ బాబు చాలా అవమానాలు ఫేస్ చేశాడట.అది కూడా తనని ఎంతో ఇష్టపడ్డ, ఆరాధించబడిని జయలలిత తల్లినే ( Jayalalitha Mother) అవమానించిందట.
అవమానం అంటే అది మామూలు అవమానం కాదట.చాలా దారుణమైన అవమానం.
కలర్ గురించిన అవమానం కావడం గమనార్హం.సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మొదటి డిటెక్టివ్ ఫిల్మ్ గూఢచారి 116( Goodachari 116 ) సినిమాలో అసలు హీరోగా చేయాల్సింది శోభన్ బాబునే.
ఆయన్నే హీరోగా అనుకున్నారు.హీరోయిన్ గా జయ లలితని( Jayalalitha ) తీసుకున్నారట.
జయలలిత అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తుంది.కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్ద గుర్తింపు దక్కలేదట.
ఆమె తల్లి సంధ్య( Sandhya ) అప్పటికే పెద్ద నటి.బాగా రిచ్ పార్టీ కూడా.
"""/" /
దీంతో ఆ యాటిట్యూడ్ ఆమెలో గట్టిగానే ఉందట.గూఢచారి 116 సినిమా సెట్ కి జయ లలిత తో పాటు ఆమె తల్లి కూడా వచ్చింది.
హీరో ఎవరో అని అడగ్గా, అప్పుడే ఏదో పని చేసి వచ్చిన శోభన్ బాబుని చూపించారు నిర్మాత దూండి.
ఆ సమయంలో శోభన్ బాబు జిడ్డు మొహంతో ఉన్నాడట, ఎండకి కాస్త కలర్ తక్కువగా కనిపించాడట.
అలా సోగ్గాడిని చూసిన జయలలిత తల్లి నా కూతురు కలర్ ఏంటి? ఆయన కలర్ ఏంటి? ఆయన సరసన నా కూతురు హీరోయిన్ గా చేయడమేంటి? అని దారుణంగా మాట్లాడిందట.
అంతేకాదు హీరోని మారిస్తేనే మా అమ్మాయి చేస్తుందని, లేదంటే వేరే హీరోయిన్ ని చూసుకోండి అని తెగేసి చెప్పిందట.
అది కూడా శోభన్ బాబు ముందే.దీంతో హీరోగా మారుతున్నాననే ఎన్నో ఆశలతో ఉన్న శోభన్ బాబుకి ఒక్కసారిగా నీరు గారిపోయిన పరిస్థితి.
పూర్తి డిజప్పాయింట్ అయిపోయారట. """/" /
దర్శక నిర్మాతలు కూడా శోభన్‌బాబుని తీసేయాల్సి వచ్చింది.
అయితే హీరోగా ఆయన్ని తప్పించి కృష్ణని( Krishna ) తీసుకున్నారు.అందులో మరో గెస్ట్ రోల్ లాంటి, కీలకమైన పాత్ర ఏజెంట్ 303 లో శోభన్ బాబుని నటింపచేశారు.
పాత్ర కనిపించేది ఐదు నిమిషాలే అయినా చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది.దీంతో సినిమా విడుదలయ్యాక కృష్ణతో సమానమైన పేరు శోభన్ బాబుకి రావడం విశేషం.
అయితే జయలలిత తల్లి సంధ్య మాట్లాడిన మాటలు, ఆ అవమానం తన మనసులోనే ఉంది శోభన్ బాబుకి.
ఒక మూలన అది కొడుతూనే ఉంది.ఆయన చాలా బాధపడిపోయాడు.
ఆ తర్వాత హీరోగా మారి పెద్ద హిట్లు అందుకున్నాడు.
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…