Aishwarya Rai Jaya Bachchan: ఐశ్వర్య ను కాకుండా ఆ హీరోయిన్ ని కోడలు గా తెచ్చుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసిన జయ బాధురి

ఐశ్వర్య రాయ్.( Aishwarya Rai ) ఆమె ఒక అందాల సుందరి.

ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి.అందుకే నువ్వు ఏమైనా ఐశ్వర్య రాయి అనుకుంటున్నావా అని సరదాగా పక్కవారిని ఎగతాళి చేస్తూ ఉంటాం.

అంతలా ఆమె పేరు అందానికి చిరునామాగా మారిపోయింది.కానీ అలాంటి ఐశ్వర్య రాయ్ కోడలుగా వస్తానంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి.

కానీ అమితాబ్ బచ్చన్( Amitab Bachchan ) భార్య అయినటువంటి జయా బాదురి( Jayabaduri ) ఐశ్వర్యను కోడలుగా తీసుకొస్తానంటే ససేమీరా ఒప్పుకోలేదు.

అభిషేక్ బచ్చన్ తో ఆమె నడిపిన ప్రేమాయణం పట్ల ఆమె ఎంతో అసంతృప్తిగా ఉండేది.

అసలు ఐశ్వర్య కోడలుగా తీసుకురావడానికి ఒక్క శాతం కూడా ఆమెకు ఇంట్రెస్ట్ లేదు.

ఈ విషయంపై చాలా రోజుల పాటు మల్లగుల్లాలు పడ్డారు.కానీ చివరికి కొడుకు ప్రేమను ఆమె ఒప్పుకోక తప్పలేదు.

ఆలా చివరికి ఐశ్వర్య బచ్చన్ కుటుంబానికి కోడలుగా వెళ్ళింది.అభిషేక్ ఐశ్వర్యలకు గారాల పట్టి ఆరాధ్య కూడా పుట్టింది.

ప్రస్తుతం ఆమె వయసు 11 సంవత్సరాలు. """/" / మరి ఇంతలా జయా బాదురి ఐశ్వర్య ను కోడలుగా వద్దు అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి.

ఎందుకంటే అభిషేక్ బచ్చన్ కి( Abhishek Bachchan ) ఐశ్వర్యను ప్రేమించిన సమయంలో అంతగా పాపులారిటీ లేదు.

కానీ ఐశ్వర్య మాత్రం ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు కలిగి ఉంది.అభిషేక్ కన్నా కూడా ఎక్కువ ఫేమ్ కలిగి ఉంది.

తన కొడుకును ఐశ్వర్య తన ఫేమ్ తో డామినేట్ చేస్తుందనే భయం జయ బాదురి లో ఉండేది.

ఎప్పటికైనా తన కొడుకు మాత్రమే గొప్పగా ఉండాలని కోరుకుంది కోడలు కాస్త తక్కువగా ఉండాలని జయా బాదురి ఆలోచన.

"""/" / ఆమె ఆలోచనలో తప్పు లేకపోవచ్చు కానీ కొడుకు ఇష్టం ముందు ఆ ఆలోచనలన్నీ దిగదుడుపే కదా.

మొత్తానికి ఐశ్వర్య అయితే తన కోడలుగా వచ్చింది కానీ ఐశ్వర్య కన్నా కూడా రాణి ముఖర్జీ( Rani Mukherjee ) తన ఇంటి కోడలైతే బాగుంటుంది అనేది జయా బాదురి ఆలోచన.

ఈ విషయంపై ఇంట్లో ఎన్నో రోజుల పాటు గొడవలు కూడా జరిగాయట.ఇప్పటికీ కూడా జయ బాదురి ఐశ్వర్య కన్నా రాణి ముఖర్జీతోనే బయట ఎక్కువగా కనిపిస్తుంది.

ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వారిద్దరూ కలిసి ఆలింగనం చేసుకుంటారు.వారిద్దరు మీడియాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా అవుతుంటారు.

మొత్తానికి రాణి ముఖర్జీతో బంధమైతే కుదరలేదు కానీ స్నేహం మాత్రం అలాగే ఉంది జయ బాదురికి.

నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!