విడాకులు తీసుకున్న 11 ఏళ్ల తర్వాత అలాంటి కామెంట్లు చేసిన నటి.. ఏమన్నారంటే?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం సాధారణమైంది.వేర్వేరు కారణాల వల్ల సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
విడాకుల తర్వాత సెలబ్రిటీ జోడీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బంధాల్లో చిక్కుకోవడం కంటే విడాకులు తీసుకుని సింగిల్ లైఫ్ బాగుంటుందని నటి జయ ఆశన్( Actress Jaya Ashan ) కామెంట్లు చేశారు.
"""/" /
సింగిల్ గా ఉండటం ఎంతో బాగుందని ఆమె పేర్కొన్నారు.బంధాలలో చిక్కుకోవడంతో పోల్చి చూస్తే స్వతంత్రంగా జీవించడమే సంతోషాన్ని కలిగిస్తుందని జయ ఆశన్ అన్నారు.
నా చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తున్న సమయంలో ఒంటరిగా జీవించడమే నయమని అనిపిస్తోందని ఆమె వెల్లడించారు.
సింగిల్ గా నేను సంతోషంగా ఉన్నానని జయ ఆశన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
అయితే గతంలో మాత్రం నేను కొన్ని స్పెషల్ మూమెంట్స్ ను మిస్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
కాఫీ తాగడం, కబుర్లు ఆడుకోవడం మిస్ అవుతున్నానని అనిపించినా ఫ్యామిలీ వాటిని భర్తీ చేసిందని జయ ఆశన్ అన్నారు.
ప్రముఖ మోడల్ ఫైజల్ తో( Model Faizal ) జయ ఆశన్ కు వివాహం జరిగింది.
2012 సంవత్సరంలో వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం జరుగుతోంది. """/" /
కోకా కోలా యాడ్( Coca Cola Ad ) ద్వారా జయ ఆశన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
బుల్లితెరపై పంచమి సీరియల్ తో ఈ నటి కెరీర్ మొదలైంది.బెంగాళీలో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలలో నటించారు.
అనిరుద్ధ చౌదరి( Aniruddha Chaudhary ) డైరెక్షన్ లో సినిమాతో బాలీవుడ్( Bollywood ) లోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
బంగ్లాదేశ్ కు చెందిన ఈ నటి అక్కడ కూడా పలు సినిమాలలో నటించడం గమనార్హం.
జయ ఆశన్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
బహిరంగంగా కొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్