ఉత్తరాంధ్రకు పెనుముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు.ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మొన్ననే దక్షిణ కోస్తా అదేరీతిలో రాయలసీమ ప్రాంతాలలో భారీగా వర్షాలు పడడంతో రైతులు, ప్రజలు.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పంట పొలాలు నీట మునగడం తోపాటు.
పెద్ద పెద్ద భవనాలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి.అయితే ఇది జరిగి కొద్ది రోజులు కాకముందే తాజాగా ఆంధ్రప్రదేశ్ కి మరో తుఫాను హెచ్చరిక వాతావరణం శాఖ చేయడం జరిగింది.
జవాద్ తుఫాను వస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఈ తుఫాను ఉత్తరాంధ్ర వైపు వస్తున్నట్లు దీంతో ఉత్తరాంధ్ర వాసులు జాగ్రత్తగా ఉండాలని రెడ్ అలర్ట్ ప్రకటించింది.
రేపు ఉదయం తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు.స్పష్టం చేయడం జరిగింది.
విశాఖ కి 700 కిలోమీటర్ల దూరంలో.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో.
దీని ప్రభావం ఉత్తరాంధ్ర పై బలంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఒక్క ఉత్తరాంధ్ర పై మాత్రమే కాక ఒడిశా పై కూడా జవాద్ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం ఇది విశాఖ పట్టణానికి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రేపు తీరం దాటే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది.