బీఎస్ఎఫ్ క్యాంపులో కలకలం.. ఆత్మహత్య చేసుకున్న జవాన్.. !
TeluguStop.com
ధైర్యం చెప్పుకోవడానికి చిన్నదే కానీ, ఈ ధైర్యం లేకనే ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చివరికి ఎంతో వ్యయప్రయాసలకు తట్టుకుని, కఠినమైన శిక్షణ తీసుకుని దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాల మీద ఎత్తుకున్న జవాన్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం విషాదం.
ఎన్నో ప్రమాదకర ఘటనలను ఎదుర్కొన్న జవాన్ విధిచేతిలో బలహినపడి మరణించడం బాధాకరం.ఇంతలా ఎందుకు వేదన చెందవలసి వచ్చిందంటే.
బీఎస్ ఎఫ్ క్యాంపులో జవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి.
ఆ వివరాలు చూస్తే.చత్తీస్ ఘడ్‌లోని కంకేర్ జిల్లా కొయిలిబెడ పోలీస్ స్టేషన్ సమీపంలోని బీఎస్ఎఫ్ క్యాంపులో జవాన్‌గా పనిచేస్తున్న, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రదీప్ శుక్లా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇకపొపతే ప్రదీప్ శుక్లా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కొయిలిబెడా పోలీసులు ధృవీకరించారు.ఇక ఈ మరణానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
మొసలి నోట్లో వీధి కుక్క.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!