నోరూరిస్తున్న జపనీస్ స్టైల్ స్ప్రింగ్ రోల్స్.. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

కొత్త స్ట్రీట్ ఫుడ్ ట్రెండ్ససోషల్ మీడియా( Social Media )లో ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చండీగఢ్‌( Chandigarh )లోని ఒక వ్యాపారి జపనీస్ ట్విస్ట్‌తో స్ప్రింగ్ రోల్స్‌ను తయారు చేస్తూ అందరికీ నోరు ఊరిస్తున్నాడు.

ఆ ఫుడ్ ఐటమ్ తయారీకి సంబంధించిన వీడియోను ఫుడ్‌పండిట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ పేజీ పోస్ట్ చేసింది.

ఆ వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.10,000 పైగా లైక్‌లు, వందలాది కామెంట్‌లను అందుకుంది.

"""/" / ఇటీవల జపాన్‌కు వెళ్లినట్లు చెబుతున్న ఈ వంటగాడు మష్రూమ్ కార్న్, పనీర్ మలై, పనీర్ మసాలా అనే మూడు రకాల స్ప్రింగ్ రోల్స్‌ను ప్రిపేర్ చేసి ఆకట్టుకుంటున్నాడు.

అతను కొన్ని జపనీస్ పదార్థాలు, మసాలా దినుసులను జోడించి వాటికి ప్రత్యేకమైన రుచి, షేప్ అందిస్తానని చెప్పాడు.

తన స్ప్రింగ్ రోల్స్‌( Spring Rolls )కు మంచి ఆదరణ ఉందని, తనకు ప్రతిరోజూ కస్టమర్లు క్యూ కొడతారని కూడా అతను చెప్పాడు.

"""/" / మష్రూమ్ కార్న్ స్ప్రింగ్ రోల్‌ని ప్రయత్నించి సూపర్ గా ఉందని ఒక ఫుడ్ వ్లాగర్ వీడియోలో తెలిపాడు.

అతను ఇప్పటివరకు తిన్న ఉత్తమ స్ప్రింగ్ రోల్స్‌లో ఇది ఒకటని, ఇది క్రిస్పీగా, జ్యుసిగా, రుచికరమైనదని చెప్పాడు.

ఈ ఫుడ్ ఐటమ్ క్రియేటివిటీ కి కూడా అతను హాట్సాఫ్ చెప్పాడు.ఈ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది, వారు జపనీస్ స్టైల్ స్ప్రింగ్ రోల్స్‌ను ప్రయత్నించడానికి తమ ఆసక్తిని, ఉత్సుకతను వ్యక్తం చేశారు.

కొందరు ఈ కుక్ కచ్చితమైన లోకేషన్, స్ప్రింగ్ రోల్స్ ధరను కూడా అడిగారు.

మరికొందరు విక్రేత కృషి, నైపుణ్యాన్ని ప్రశంసించారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్….సిగ్గుందా అంటూ?