‘జపాన్’ ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
TeluguStop.com
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీ ( Karti ) ఏ సినిమా చేసిన తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది.
ఎందుకంటే కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేయడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ కార్తీ ఈ మధ్యనే పొన్నియన్ సెల్వన్ 1, 2( Ponnian Selvan 1, 2 ) లతో మంచి హిట్ అందుకున్నాడు.
ఆ మధ్యలో సర్దార్ సినిమాతో కూడా అలరించిన కార్తీ ప్రజెంట్ యంగ్ డైరెక్టర్ రాజు మురుగన్ ( Young Director Raju Murugan )తో జపాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
"""/" /
ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఈ రోజు రాత్రి 10 గంటలకు ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ రోజు తమిళ్ నాడులో ఆడియో లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగుతుంది.
ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు మేకర్స్.ప్రతీసారి విభిన్నమైన పాత్రలలో నటిస్తూ వస్తున్న కార్తీ ఈ సినిమాలో ఒక ఎంటర్టైనింగ్ డాన్ లా కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా జివి ప్రకాష్ సంగీతమే అందిస్తున్నాడు.
దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది.మరి జపాన్ సినిమాతో కార్తీ ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ టికెట్ రేట్లు ఇవే.. టికెట్ రేట్లు ఎంతంటే?