Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. చూడటానికి జపాన్ నుంచి ఫ్యాన్స్ రావడంతో?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.కాగా గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింప తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం అదే ఊపుతో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో( Game Changer Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే రామ్ చరణ్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే.

"""/" / ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) ప్రమోషన్స్ సమయంలో అక్కడకి వెళ్లిన రామ్ చరణ్ కి జపాన్ అభిమానుల( Japan Fans ) నుంచి ఒక రేంజ్ వెల్కమ్ వచ్చింది.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.అయితే వారి అభిమానం జపాన్ లోనే ఆగిపోలేదు.

ఇండియా, హైదరాబాద్ వరకు వచ్చేసింది.తాజాగా జపాన్ కి చెందిన కొందరు లేడీ ఫ్యాన్స్ చరణ్ ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు.

వారందర్ని రామ్ చరణ్ తన ఇంటిలో కలుసుకున్నట్లు తెలుస్తోంది. """/" / వారి తెచ్చిన గిఫ్ట్స్ ని రామ్ చరణ్ కి అందించారు.

ఇక వచ్చిన వారందరితో రామ్ చరణ్ ఫోటోలు దిగి వారిని ఆనందపరిచాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక పిక్స్ చూసిన అభిమానులు.నిజమైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ఫోటోలను చూసిన అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇది కదా చెర్రీ రేంజ్ అంటే, ఇది కదా రామ్ చరణ్ క్రేజ్ అంటే అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆ సినిమాకి డైరెక్టర్ విఠలాచార్య అనుకున్నారు.. రాఘవేంద్రరావుకి మతిపోయింది..?