వైరల్: ‘హా! నువ్వు కావాలయ్యా’ పాటకు ఫిదా అయిపోయిన జపాన్‌ రాయబారి!

తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ 'జైలర్‌' ( Jailer Movie ) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రంలోని ''వా.నువ్వు కావాలయ్యా.

నువ్వు కావాలి'' పాట అయితే సినిమా విడుదలకు ముందే హిట్ అయ్యి జనాలను హోరిత్తిస్తోంది.

యావత్ ఇండియా అంతటా భాషతో సంబంధం లేకుండా ఈ పాట యువతని హుషారెత్తిస్తోంది.

ఈ క్రమంలో చాలామంది రీల్స్ క్రియేటర్స్ ఈ పాటకు డాన్సులు ఇరగదీస్తున్నారు.అచ్చం తమన్నాను( Tamanna ) ఇమిటేట్ చేస్తూ కనువిందు చేస్తున్నారు.

అదంతా ఒకెత్తయితే ఈ పాట ఇపుడు ఖండాంతరాలు దాటింది. """/" / అవును, వయసులో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు కాలు కదుపుతున్నారు.

అటు సామాన్యులనుండి సెలబ్రిటీలు వరకు దీనిపై రీల్స్‌ చేసి ఆకట్టుకున్నారు.తాజాగా ఈ పాటకు భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి( Japan Ambassador Hiroshi Suzuki ) డ్యాన్స్‌ వేసి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇప్పటికే 100 మిలియన్‌ వ్యూవ్స్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన ఈ పాటలో.

తమన్నా వేసిన హుక్ స్టెప్‌ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది.ఇప్పుడు ఇదే స్టెప్‌ను హిరోషి సుజుకి వేయడం కొసమెరుపు.

అయన ప్రముఖ యూట్యూబర్‌ మాయో సాన్‌తో( Youtuber Mayo San ) కలిసి ఈ పాటకు డ్యాన్స్ వేశారు.

ఈ వీడియోను తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది.

"""/" / ఈ సందర్భంగా అయన రజనీకాంత్‌పై( Rajinikanth ) తన ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసారు.

దీన్ని పోస్ట్‌ చేసిన 24 గంటల్లోపే 9 లక్షల మందికి పైగా వీక్షించడం కొసమెరుపు.

'రజనీపై మీకున్న అభిమానం కనిపిస్తోంది', 'చాలా బాగా చేశారు' అంటూ తమిళ తంబీలు కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇక 'జైలర్‌' విడుదల సమయంలోనూ హిరోషి సుజుకి ఓ ప్రత్యేక వీడియో చేసిన సంగతి విదితమే.

రజనీ స్టైల్‌లో కళ్లజోడును తిప్పుతూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇక జపాన్‌లో రజనీ కాంత్‌ కు వున్న క్రేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరోవైపు 'జైలర్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.రజనీ కాంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీగా రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్పటి వరకు రూ.450కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

త్వరలోనే రూ.500 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మార్నింగ్ వాక్‌కి వెళ్లిన మహిళపై లైంగిక దాడి.. వీడియో వైరల్!