దేవర సినిమా గురించి అలాంటి కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్?
TeluguStop.com
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్,( Ntr ) కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం దేవర.
( Devara Movie )గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా( Janatha Garage ) బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.
దాదాపు మళ్లీ ఏడేళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.ఈ క్రమంలోనే దేవర అనే పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janvi Kapoor ) మొదటి సారి తెలుగులో హీరోయిన్ గా నటిస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.నేను ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మూడు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాను అని తెలిపింది.
షూటింగ్ సమయంలో భాషపరంగా ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడగగా ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ.
"""/" /
ఇప్పటివరకు యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రమే జరిగాయి.అందుకే లాంగ్వేజ్ కి సంబంధించి ఎలాంటి సమస్య రాలేదు.
సెప్టెంబర్ నుంచి దేవర సినిమాకి సంబంధించి పూర్తిస్థాయి షూటింగ్ లో పాల్గొంటాను అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ తో సినిమా చేయటమే నా డ్రీమ్…. మనసులో కోరిక బయటపెట్టిన నటి?