హీరోయిన్‌ ను లైవ్ లో ముద్దు అడిగేశాడు.. ఆమె సమాధానం ఏంటో తెలుసా?

హీరోయిన్స్ సోషల్‌ మీడియాలో లైవ్‌ చాట్‌ కు రావడం సర్వసాదారణం.వారు లైవ్‌ చాట్‌ లో ఉన్న సమయంలో రకరకాల ప్రశ్నలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజాగా లైవ్‌ లో ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ను ఒక అభిమాని ఏకంగా ముద్దు అడిగేశాడు.

దానికి ఆమె చాలా సరదాగా తీసుకుని సమాధానం చెప్పింది.మనం ముద్దు పెట్టుకుందామా అంటూ అతడు అడిగిన ప్రశ్నకు జాన్వీ సమాధానంగా నో అని చెప్పడంతో పాటు కరోనా ఉంది అంటూ మాస్క్‌ తో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది.

కరోనా ఉండటం వల్ల అలాంటివి కుదరవు అన్నట్లుగా ఆమె సమాధానం ఇచ్చింది.కరోనా లేకుంటే ముద్దుకు ఓకే నా అన్నట్లుగా చాలా మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

శ్రీదేవి ముద్దుల కూతురుగా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌ మొదటి సినిమా ధడక్ తో నిరాశ పర్చింది.

శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల ఆ సినిమా కమర్షియల్‌ గా పర్వాలేదు అనిపించింది.

ఆ తర్వాత జాన్వీ కపూర్‌ వెబ్‌ సిరీస్ తో వచ్చింది.ఇక గుంజన్‌ సక్సేనా సినిమా తో జాన్వీ కపూర్‌ పెద్ద సాహసమే చేసింది.

ఆమె చేసిన సాహసం నిరాశను మిగిల్చింది.ఏమాత్రం సక్సెస్‌ కాకపోవడంతో పాటు ఆమె రికమండేషన్‌ క్యాండెట్‌ అంటూ నటనకు విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆమె మరింత కసితో సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం జాన్వీ రెండు మూడు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

అందులో ఏ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఆ సినిమా తో అయినా ఈమె కు మళ్లీ క్రేజ్‌ దక్కుతుందా అనేది చూడాలి.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?