జన్నారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి భూ బాధితులకు న్యాయం చేయాలి

సూర్యాపేట జిల్లా: నూతనకల్, మద్దిరాల మండలాల్లోని జన్నారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి భూస్వాముల వద్ద కొనుగోలు చేసిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ,న్యూ డెమోక్రసీ, ప్రజాపంథా పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నూతనకల్ తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు ధూళిపాళ్ల ధనుంజయ్ మాట్లాడుతూ సీలింగ్ యాక్ట్ పూర్వం జన్నారెడ్డి భూస్వాముల పట్టా భూములు తాతలు, తండ్రులు నాడు కొనుగోలు చేసి నేటి వరకు కాస్తు, కబ్జాలలో ఉండి సేద్యం చేసుకుంటున్నా రైతులకు నేటి వరకు ప్రభుత్వాలు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదన్నారు.

ఈ భూములను కొనుగోలు చేసుకున్న రైతులు అత్యధికులు ఎస్సీ,ఎస్టీ, బడుగు,బలహీన వర్గాలకు చెందిన పేద రైతులు ఉన్నారన్నారు.

రైతులందరికీ కలిసి కోర్టుకు వెళ్లడం మూలంగా అర్హులను గుర్తించి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ రెవిన్యూ అధికారులు నేటికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకాలం నుండి రైతులకు పట్టా పాస్ పుస్తకం ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే జన్నారెడ్డి భూస్వాముల వద్ద కొనుగోలు చేసిన రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాహాసిల్దార్ కు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మూరగుండ లక్ష్మయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తొట్ల ప్రభాకర్,అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ప్రజాపంథా జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెద్దింటి రంగారెడ్డి,నాయకులు కునుకుంట్ల సైదులు, బాణాల వెంక రెడ్డి,తొట్ల లింగయ్య,బొజ్జ శీను, బత్తుల సోమయ్య, కల్లేపల్లి భాస్కర్,కూసు సైదులు,దేశోజు మధు, మందడి భూపాల్ రెడ్డి, సింహాద్రి,పల్లా సుదర్శన్, దేవరకొండ యాదగిరి, పులసరి వెంకట ముత్యం, భువనగిరి లింగయ్య, మున్న అశోక్,ముండ్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అమెరికాను వణికిస్తున్న ‘హెలెనా ’ .. 64 మంది మృతి, 146 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో!!