ఘనంగా జంజీరాల పౌర్ణమి వేడుకలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండల కేంద్రంలోనిశివ భక్త మార్కండేయ దేవాలయం( Shiva Bhakta Markandeya ) లో గురువారం జంజీరాల పౌర్ణమి సందర్భంగా మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పద్మశాలి సంఘ సభ్యులచే నూతన జంజరోపవీతము,పూజా కార్యక్రమం అభిషేకం ద్వజ స్థంభం పతాక అవరోహణ చేశారు.

ప్రతి సంవత్సరం లాగా చేనేత మగ్గం పై వస్త్రం నేస్తూ శోభ యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు నూలు పున్నం అనగా దారం పుట్టిన రోజు కావున యావత్ సమాజం ఒంటిపై జంధ్యం ధరించిన రోజున జంధ్యాల పూర్ణిమి అని అంటారని అన్నారు.

రాఖీ పౌర్ణమి( Raksha Bandhan ) విశిష్టతను వివరిస్తూ,రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశాళి సంఘ సభ్యులు ,శివ భక్త మార్కండేయ దేవాలయ కమిటి సభ్యులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్.. ఆ దర్శకుని కూతురు కోసం ఏకంగా అన్ని చాక్లెట్స్ పంపారా?