ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్న దేవుడు నితిన్ అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్!

జానీ మాస్టర్.ఈయన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన కొరియోగ్రాఫర్.

ఈయన బుల్లితెర పై అప్పుడప్పుడు షోలలో సందడి చేస్తూ ఉంటాడు.అయితే ఈయన కెరీర్ ను ఒకసారి చుస్తే.

చాలా కష్టపడుతూ ఈ చేరుకున్నాడు.వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈయన ఇటీవలే బీస్ట్ సినిమాలో ఎంతగానో పాపులర్ అయినా అరబిక్ కుత్తు సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసి మరింత పేరు సంపాదించు కున్నాడు.

ఇక తాజాగా ఈయన నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమాలో స్పెషల్ సాంగ్ కు కంపోజ్ చేసారు.

అంజలి నర్తించిన ఈ స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇక నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జానీ మాస్టర్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజక వర్గం సినిమా ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా మాచర్ల నియోజకవర్గం నుండి మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను జులై 30న రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 30న గ్రాండ్ గా గుంటూరు బ్రాడీపేట లోని ఎల్ ఈ ఎం స్కూల్ గ్రౌండ్స్ లో జరిగింది.

"""/" / ఈ ఈవెంట్ లో జానీ మాస్టర్ మాట్లాడుతూ.నాకు ఏ సినిమా అయినా ఇష్టమే.

కానీ ఈ సినిమా అంటే ఇంకా ఇష్టం.ఎందుకంటే నితిన్ అంటే నాకు చాలా ఇష్టం.

నేను కెరియర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నితిన్ నా వెనుకుండి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు.

అందుకే ఆయనను నేను ఎప్పటికి మర్చిపోలేను.కొరియోగ్రాఫర్ గా నేను సంపాదించుకున్న మనీ, పేరు అంతా ఆయన ఇచ్చినదే అంటూ ఎమోషనల్ అయ్యాడు.

జూకీపర్‌పై మగసింహం అటాక్.. ఆడ సింహం ఎలా ఆపిందో చూడండి..