ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్ లో ఉన్న డాన్స్ మాస్టర్స్ లో జానీ మాస్టర్ కూడా ఒకరు.

ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో పాటలకు కొరియోగ్రఫీ చేసి కొరియోగ్రాఫర్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు జానీ మాస్టర్.

అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షోకి జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. """/" / అలాగే బుల్లితెరపై ప్రసారమైన పలు పండుగ ఈవెంట్ లో కూడా పాల్గొని తన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

కాగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కు వీరాభిమాని అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే.పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీ( Jana Sena Party)లో చేరి పార్టీ విజయానికి ప్రచారం చేసాడు.

"""/" / తాజాగా ఆయన మీద పోలీసు కేసు నమోదు అయ్యింది.జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు గా ఉన్నాడు.

అందులో సతీష్ ( Satish )అనే డాన్సర్ మెంబర్ గా ఉన్నాడు.ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకి ఫిర్యాదు చేసాడు.

నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్ కి పిలవడం లేదని, తనకి వర్క్ చెప్పిన కో ఆర్డినేటర్స్ ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొన్నాడు.

ఆయన ఆలా చెయ్యడం వాళ్ళ ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

హైదరాబాద్ నగరం లోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదు అయ్యింది.

మరి ఇందులో అసలు నిజా నిజాలు ఏంటో తెలియాలి అంటే జానీ మాస్టర్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన లాభం లేదా… ప్రతివారం అలా చేయాల్సిందేనా?