రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన జానీ మాస్టర్… ఆయన రియాక్షన్ ఇదే?

బెంగుళూరు రేవ్ పార్టీ( Rave Party ) లో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ ( Drugs )స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ విషయం అటు కన్నడ చిత్ర పరిశ్రమలోను అలాగే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది.

ఈ రేవ్ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది.

ఇక ఈ పార్టీలో నటి హేమ ( Hema ) శ్రీకాంత్(Sreekanth ) ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై వారిద్దరూ స్పందించి క్లారిటీ ఇచ్చారు. """/" / ఇకపోతే పోలీసులు అరెస్టు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇందులో భాగంగా ఒక వ్యక్తి మొహం కనపడకుండా జాగ్రత్తలు పడ్డారు.అచ్చం ఆయన చూడటానికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) లా ఉన్నారు.

దీంతో జానీ మాస్టర్ రేవ్ పార్టీలో అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ఈయన అరెస్ట్ అయ్యారనే విషయం తెలియడంతో పలువురు వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

"""/" / ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు.

నాకు అటువంటి అలవాట్లు లేవని.నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం అదే అని అన్నాడు .

అనవసరంగా తనపై, జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇదని ఖండించాడు.ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటామని కౌంటర్లు ఇచ్చాడు.

ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితిపై జాలి కలుగుతుంది అంటే తనదైన సైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఆస్పత్రిలో చేరిన దేవర బ్యూటీ… ఆందోళనలో అభిమానులు?