త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Johnny Master )పై లైంగిక వేధింపుల కారణంగా ఒక మహిళా కొరియోగ్రాఫర్ కేసుపెట్టడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా కూడా మారింది.చాలా కీలక మలుపులు కూడా తిరిగిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ కేసులో ఇటీవల హైకోర్టు బెయిల్ (High Court Bail )మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యారు.
"""/" /
విడుదల అయి చాలా రోజలు అవుతున్న జానీ మాస్టర్ మీడియాకు అలాగే సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.
అయితే తాజగా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) హీరోగా వస్తున్న KCR అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈ ఈవెంట్ లో బాగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.ప్రతి భర్త వెనకాల భార్య ఉంటుంది.
వాళ్ళ వల్లే భర్తలు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు.ఈ మధ్య నా జీవితంలో నాకు కొన్ని కొన్ని జరిగాయి.
ఆ క్లిష్ట సమయంలో నా భార్య నాకు వెన్నుముక లాగా, గజస్తంభం లాగా నిలబడింది.
"""/" /
అలాగే నన్ను నమ్మిన నా ప్రజలకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్.
ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చాక ఎవరు కనిపించరు.అలాంటింది నన్ను మీ ఇంటి కుర్రాడి లాగ, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించినందుకు చాలా చాలా థాంక్స్.
నా మీద నమ్మకం ఉంచినందుకు.ఆ నమ్మకం అలాగే ఉంటది, అది ఎక్కడికి పోదు.
త్వరలొనే నేనేంటో చూపిస్తాను.ఇప్పుడు సందర్భం కాదు ఆ విషయం గురించి మల్లి మాట్లాడతాను అని అన్నారు జానీ మాస్టర్.
బెయిల్ పై బటయ ఉన్న జానీ మాస్టర్ సినిమాలు ఏవి చెయ్యట్లేదు.
వివాదాల నడుమ నయనతార డాక్యుమెంటరీ పై మహేష్ కామెంట్స్.. అంత నచ్చేసిందా?