ఆస్పత్రిలో చేరిన దేవర బ్యూటీ… ఆందోళనలో అభిమానులు?
TeluguStop.com
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ) అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది.
ఈమె అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది.ఈ విధంగా జాన్వీ కపూర్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు తనకు ఏమైంది ఉన్నఫలంగా ఇలా హాస్పిటల్లో చేరడం ఏంటి అనే విషయాల పట్ల పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
"""/" /
ఇలా అభిమానులు ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడంతో బోణీ కపూర్( Boney Kapoor ) ఆమె ఆరోగ్యం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని తెలిపారు.
ఫుడ్ పాయిజన్ కారణంగా ఆమె కాస్త అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు.ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుందని నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఇక ఇటీవల ఈమె అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
"""/" /
ఇలా ఒకవైపు పెళ్లి వేడుకలలో సందడి చేసిన ఈమె మరోవైపు వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
అంతేకాకుండా జాన్వీ నటించిన ఉలజ్ మూవీ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే జాన్వి కపూర్ తెలుగులో ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమాకు కూడా హీరోయిన్ గా ఈమె కమిట్ అయ్యారు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?