ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్.. కొరటాల పక్కా స్కెచ్?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రంలో నటించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది.ప్రస్తుతం ఎన్టీఆర్ RRR ప్రమోషన్ లో బిజీ కానున్నారు.
దీంతో ఈ సినిమా విడుదల తర్వాత కొరటాల సినిమా పట్టాలు ఎక్కనుంది.ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఈ క్రమంలోని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, కియారా పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా మరొక బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది.అందాల తార శ్రీదేవి తనయ జాన్వి కపూర్ పేరు వినిపిస్తోంది.
కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న చిత్రం ద్వారా జాన్వికపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
"""/"/
ఈ సినిమాలో దాదాపు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని జాన్వీకపూర్ దక్కించుకుందని సమాచారం.
అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది తిరిగి ఇదే కాంబోలో సినిమా రాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ముఖ్యంగా జాన్వికపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.
ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక రైలు .. ఏంటి దీని స్పెషాలిటీ?