మరో తెలుగు సినిమాని కూడా తిరష్కరించిన జాన్వీ కపూర్
TeluguStop.com
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా సినిమా లు చేసింది.
సినిమా లు మాత్రమే కాకుండా సిరీస్ ల్లో కూడా ఈమె నటించింది.కానీ హిందీ ప్రేక్షకులు ఈమె ను అంతగా ఆధరించడం లేదు.
అందుకే తెలుగు లో ఎన్టీఆర్ కి జోడీగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా( Devara Movie ) లో నటిస్తున్న విషయం తెల్సిందే.
తెలుగు లో ఒక సినిమా ను చేస్తూ ఉంటే హిందీ లో ఏకంగా నాలుగు అయిదు సినిమా లకు ఓకే చెప్పింది.
తెలుగు లో మాత్రం ఒక్కటే సినిమా ను చేస్తోంది.జాన్వీ కపూర్ అతి లోక సుందరి శ్రీదేవి కూతురు కనుక ఇక్కడ మంచి క్రేజ్ ఉంది.
"""/" /
కానీ ఇక్కడ మాత్రం ఆమె నో చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కేవలం దేవర సినిమా ను మాత్రమే చేస్తోంది.
ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమా కు ఈమె ని సంప్రదించగా నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
అంతే కాకుండా జాన్వీ కపూర్ తాజాగా ఒక యంగ్ హీరో కి కూడా నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు యంగ్ హీరో తో సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ లో చేస్తున్న నేపథ్యం లో ఆ సినిమా కి గాను జాన్వీ కపూర్ ని ఎంపిక చేయాలని భావించారు.
"""/" /
కానీ ఆమె నో చెప్పడం తో చేసేది లేక జాన్వీ కపూర్ కి బదులు మరో హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నారట.
దేవర సినిమా లో నటిస్తున్న జాన్వీ కపూర్ ఎందుకు ఇతర తెలుగు సినిమా ల్లో నటించడం లేదు అంటూ అభిమానులతో పాటు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో రకరకాలుగా జరుగుతున్న చర్చకు జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టేనా చూడాలి.
పారితోషికం విషయం లోనే తేడా కారణంగానే జాన్వీ ఇక్కడ నటించడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ దారిలో నడుస్తున్న అక్కినేని హీరో.. ఆ బ్యానర్ లో నటించనున్నారా?