నీ ప్రేమను రోజు పొందుతున్నాం.. మదర్స్ డే సందర్భంగా తల్లిని గుర్తు చేసుకున్న జాన్వికపూర్!

మే 8వ తేదీ అంతర్జాతీయ మాతృ దినోత్సవం కావడంతో ఎంతో మంది సెలబ్రెటీల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరు వారి తల్లి పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి తన తల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తల్లి పై ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.

అలాగే మరికొందరు వారి తల్లులకు ఖరీదైన బహుమతులను అందజేస్తున్నారు.ఈ క్రమంలోనే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ కూడా మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకున్నారు.

శ్రీదేవి మరణాంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్ మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా జాన్వీకపూర్ తన తల్లి గురించి తెలియజేస్తూ.నువ్వు మాతో లేకపోయినా.

ప్రతిరోజు నీ ప్రేమను పొందుతున్నాం మీరు నాతో లేకపోయినా ప్రపంచంలో అత్యుత్తమమైన బెస్ట్ మదర్ మీరే.

నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/" / జాన్వీ కపూర్ ఇలా ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ చిన్నప్పుడు శ్రీదేవి తనని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.

వీడియో: బతికుండగానే పూడ్చేశారు.. వ్యూస్, లైక్స్ కోసమే అలా చేశారట..?