మేకప్ ఆర్టిస్ట్ పై కోపం.. అక్కడ తన్నిన జాన్వీ కపూర్?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే.ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంబంధించిన వీడియోలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

శ్రీదేవి పూర్తిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో ఈమెకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇది ఇలా ఉంటే జాన్వీ కపూర్ తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ తో కలిసి బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ పూజ మిశ్రాను ఇమిటేట్ చేసింది.

ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ షోనాలి నాగరాణి, పూజా మిశ్రాల మధ్య జరిగిన గొడవను జాన్వి కపూర్, రివేరా రీ క్రియేట్ చేశారు.

"""/"/ ఈ వీడియోలో పూజా మిశ్రా మాదిరి కోపంతో ఊగిపోతున్నట్లు నటించిన జాన్వి, పక్కనే ఉన్న డబ్బాను గట్టిగా తన్నింది.

అవి కాస్త వేగంగా వెళ్లి రివేరాకు తగిలింది.అప్పుడు లిన్ పూజా ఈ ప్రవర్తన ఏంటి? అని జాన్విని అడిగగా అనుకోకుండా తన్నాను అంటూ సమాధానం ఇచ్చింది.

ఈ వీడియోని పోస్ట్ చేసిన జాన్వి నాకు సహాయం కావాలని మీరు అనుకుంటున్నారా?అనే క్యాప్షన్ తో జత చేసింది.

సింహాచలం చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్