అల్లు అర్జున్ యాడ్స్ పై స్పందించిన జాన్వీ కపూర్.. అదీ బన్నీ రేంజ్ అంటూ కామెంట్స్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా పుష్ప సినిమాతో ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ కి అభిమానుల సైతం అదే స్థాయిలో పెరిగిపోయారు.

ఇక పుష్ప సినిమా మంచి హిట్ కావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా రాబోతున్న పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా ఈ సినిమా సీక్వెల్ చిత్రం మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.

ఇకపోతే ఈయన పుష్ప సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు కమిట్ కాకపోయినప్పటికీ వరుస యాడ్స్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ఆ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.

"""/"/ తాజాగా ఈయన కోకోకోలా సాఫ్ట్ డ్రింకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇలా వరుస యాడ్స్ ద్వారా అల్లు అర్జున్ ఏడాదికి సుమారు 7 కోట్లకు పైగా డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

ఇకపోతే అల్లు అర్జున్ యాడ్స్ పై ప్రముఖ నటి జాన్వీ కపూర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

యాడ్స్‌తో కూడా మెస్మరైజ్ చేసే రేంజ్ అంటూ అల్లు అర్జున్ పై నటి ప్రశంసలు కురిపించారు.

ఇలా బన్నీ గురించి జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దుండగుల చేతిలో దారుణ హత్య .. భారతీయ విద్యార్ధికి కెనడాలో ఘన నివాళి