ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జత కట్టేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసిందోచ్
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు మరో వారం రోజుల్లో జరగబోతున్నాయి.
ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే హైదరాబాద్ శివారులో భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరిగాయి.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నారు.
అధికారికంగా తేదీని కూడా ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ యాక్షన్ మూడ్ లోకి వెళ్లబోతున్నాడట.
హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) షూట్ లో పాల్గొనేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంటున్నారు.
కొరటాల శివ సినిమా అంటే కాస్త హీరోయిన్ కు ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది.
"""/" /
కథలో మెయిన్ రోల్ ఆ హీరోయిన్ ది అయినా కూడా ఆ పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా నటనకు ఆస్కారం లేనట్లుగానే ఉంటుంది.
ఆ విషయం గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.ముఖ్యంగా జనతా గ్యారేజ్( Janata Garage ) సినిమా లో సమంత పాత్ర గురించి అందరికి తెల్సిందే.
హీరోయిన్ పాత్ర ను మరీ అంత తక్కువగా చూపించడం ఏంటీ అంటూ కొరటాల శివ ను ఆ సమయంలో కొందరు విమర్శించారు.
భరత్ అనే నేను తో పాటు ప్రతి సినిమా లో కూడా హీరోయిన్ పాత్ర తక్కువగానే ఉంటుంది.
కనుక ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ కనిపించేది కొద్ది సమయం అయ్యి ఉంటుంది.
అందుకే షూటింగ్ లో ఆమె తక్కువ రోజులే పాల్గొంటుందట.అయినా కూడా జాన్వీ కి దక్కబోతున్న పారితోషికం భారీ మొత్తంలో ఉన్న విషయం తెల్సిందే.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమా లో నటిస్తున్నందుకు గాను జాన్వీ కి ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ అందబోతుందట.
పెట్టుబడి రూ.2 కోట్లు.. కలెక్షన్లు రూ.18 కోట్లు.. ఎన్టీఆర్ కు సొంతమైన రికార్డ్ ఇదే!