శుక్రవారం ఆ పనులు అసలు చేయను..జాన్వీ కపూర్ కి ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా?

శ్రీదేవి( Sridevi ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ).

ఈమె ఇదివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటించేవారు.అయితే ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్( NTR ) హీరోగా నటించిన దేవర( Devara ) సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు.

ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. """/" / ఇదిలా ఉండదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన తల్లికి సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎన్నో హిందూ సాంప్రదాయ ఆచారాలను పాటించేవారని జాన్వీ వెల్లడించారు.

తన తల్లి ఎప్పుడు తమకు ఇలాంటి ఆచార వ్యవహారాల గురించి చెప్పిన తాము పట్టించుకునే వాళ్ళం కాదు.

అమ్మ ఎప్పుడు శుక్రవారం జుట్టు కత్తిరించకూడదని చెప్పేది.అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ( Lakshmidevi ) మన ఇంట్లోకి రాదని నమ్ముతుంది అలాగే ఆరోజు నలుపు రంగు దుస్తులను కూడా వేసుకోనివ్వదు.

"""/" / ఇలా అమ్మ చెప్పిన తాము పట్టించుకోలేదని కానీ అమ్మ చనిపోయిన తర్వాత తాను కూడా వీటిని పాటిస్తున్నానని తెలిపారు.

ఇప్పటికి కూడా నేను శుక్రవారం జుట్టు కత్తిరించనని, అలాగే నలుపు దుస్తులను వేయను.

ఇక అమ్మ ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారు.

ఇక అమ్మ ఎప్పుడు కూడా నారాయణ అంటూ స్మరించుకునే వారిని, అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజు సందర్భంగా నేను తిరుపతి( Tirupati ) వెళ్లడం నేర్చుకున్నాను అంటూ జాన్వీ కపూర్ ఈ సందర్భంగా తన తల్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కాఫీలో వీటిని కలిపి తీసుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!