NTR30.. జాన్వీ ఫిక్స్.. ఒక్క పోస్టర్ తోనే భారీ హైప్!
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''ఎన్టీఆర్30''.
ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ఒక్క అప్డేట్ అంటూ అప్డేట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా ప్రకటించి ఏడాదికి పైగానే అవుతున్న ఇంకా సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.
ఇప్పటికీ ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు.త్రిపుల్ ఆర్ సినిమా ఇచ్చిన హిట్ తో ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో ఫిక్స్ చేసాడు.ఈ సినిమా ఎప్పుడో షూట్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది. """/" /
ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసారని ఇప్పటికే కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
మరి ముందు నుండి వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఈ రోజు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసారు.
జాన్వీ కపూర్ మార్చి 6న అంటే ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఈమెను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేస్తూ అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు.
"""/" /
ఈ పోస్టర్ లో జాన్వీ లంగావోణీతో ఆకట్టు కుంటుంది.సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ పోస్టర్ తో ఈమె క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
చూడాలి డెబ్యూ సినిమాతో జాన్వీ ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో.ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అని మార్చి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.
మరి మేకర్స్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.
జుట్టు రాలడం, చుండ్రు.. ఈ 2 సమస్యలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది..!