అర్ధరాత్రి కలలో అవే వస్తాయ్.. భయపడి లేచేదాన్ని.. జాన్వీ కపూర్!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరితమే.
ఈమె ప్రముఖ దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే దర్శకుడు మత్తు కుట్టి జేవియర్ పొందించిన తాజా చిత్రం మిలీ.
ఈ సినిమా మలయాళ సినిమా హెలెన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం మనందరికి తెలిసిందే.
ఈ సినిమా నవంబర్ 4వ ప్రేక్షకుల ముందుకు రానుంది.సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె ఈ సినిమాలో మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ గడ్డుకుపట్టు పోయే చల్లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిగా ఆమె నటించినట్లు చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో నేను మిలీ నౌదియార్ గా కనిపిస్తాను.ఇక దర్శకుని సూచన మేరకు ఈ సినిమాలో పాత్రకు సెట్ అయ్యే విధంగా 7.
5 కిలోల బరువును కూడా పెరిగాను.ఈ విషయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది జాన్వికపూర్.
నేను పోషించిన పాత్ర ఫ్రిజ్లో ఉన్నట్లుగా దృశ్యాలు కలలో వచ్చేవి. """/"/
దీంతో సరిగా నిద్ర పట్టేది కాదు దాంతో అనారోగ్యం దెబ్బతినింది.
మూడు రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను.నాతో పాటుగా మా దర్శకుడు కూడా అస్వస్థకు గురయ్యారు.
15 గంటలు ఫ్రీజర్ లో ఉండాల్సి వస్తే అక్కడ ఒక ఎలుక వేలును కొరుకుతుంటే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది అటువంటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాను అని చెప్పుకొచ్చింది జాన్వికపూర్.
90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..