అలాంటి వ్యక్తి భర్తగా రావాలి.. దేవర బ్యూటీ కామెంట్స్ వైరల్!

దివంగత నటి శ్రీదేవి ( Sridevi ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) .

ఈమె ఇదివరకు బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్గా నటించేవారు అయితే ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.

ప్రస్తుతం తెలుగులో ఈమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర( Devara ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల కాకముందే మరో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి త్వరలోనే షూటింగ్ జరగనుంది.

"""/" / ఇలా పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో జాన్వీ ( Janhvi Kapoor ) పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెకు పెళ్లి భర్త గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

"""/" / ఇప్పటికే ఈమె ప్రేమలో ఉన్నారని త్వరలోనే తన ప్రియుడుతో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయం గురించి తనకు ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త నా డ్రీమ్స్ అన్నింటిని కూడా తన డ్రీమ్స్ అనుకోనే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకున్నారు.

అదేవిధంగా ఎప్పుడు నా వెంటే ఉంటూ నాకు ధైర్యం చెప్పాలని ఈమె తెలిపారు.

ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి తనకు భర్తగా రావాలంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కోట్లు ఇచ్చినా సరే ఈ నలుగురు హీరోలు చచ్చిన ఆ పని చేయలేదు !