నువ్వు ఎప్పటికీ మాకు ప్రత్యేకమే… తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయిన జాన్వీ కపూర్
TeluguStop.com
శ్రీదేవి ( Sridevi ) వారసరాలుగా ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు జాన్వి కపూర్(( Janhvi Kapoor ) .
ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
తెలుగులో ఎన్టీఆర్( Ntr ) హీరోగా నటిస్తున్న దేవర( Devara ) సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకొని ఈమె సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ఆగస్టు 13వ తేదీ శ్రీదేవి జయంతి కావడంతో సోషల్ మీడియా వేదికగా తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ శ్రీదేవికి చెందినటువంటి రేర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
"""/" /
ఈ సందర్భంగా శ్రీదేవి సినిమా షూటింగ్ సమయంలో తల్లి ఒడిలో కూర్చొని ఉన్నటువంటి ఫోటోని జాన్వి కపూర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే అమ్మ షూటింగ్ సెట్స్ లో మీ అమ్మ ఒడిలో ఇలా కూర్చోవడం నీకు ఇష్టం అని నాకు తెలుసు.
నీ పుట్టినరోజున నేను కూడా సినిమా సెట్ లో ఉన్నాను.నీలాగే నేను కూడా అమ్మతో కలిసి ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను.
అందుకే నేను అనుకుంటాను ఇది నీ 60వ బర్త్ డే కాదు 35వ బర్త్ డే.
ఈ ప్రపంచంలో నువ్వు అందరికంటే ప్రత్యేకం.ఇప్పటికీ నువ్వు మాతోనే ఉన్నావని తెలుసు.
"""/" /
ఇలా మేము ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు కారణం నువ్వే అయితే ఈ రోజు నువ్వు నీకెంతో ఇష్టమైనటువంటి పాయసం ఐస్ క్రీమ్, కారమెల్, కస్టర్డ్స్ తింటావని భావిస్తున్నానని ఈ సందర్భంగా జాన్వికపూర్ తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా తన తల్లిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
రూ.16 కోట్లకు కన్యత్వాన్ని అమ్ముకున్న 22 ఏళ్ల యువతి.. ఆపై సంచలన ప్రకటన!