నేను నా చెల్లి ఓకే వ్యక్తితో డేటింగా? అదంతా చెత్త అంటూ జాన్వీ కపూర్ ఫైర్!

బాలీవుడ్ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తన తల్లి సొంతం చేసుకున్న క్రేజ్ ను తాను కూడా సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది జాన్వీ.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

చాలా వరకు స్టార్ హోదా ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు.ఇక తన అందాలతో మాత్రం గ్లామర్ విందునే వడ్డిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

హాలీవుడ్ హీరోయిన్స్ వలే గ్లామర్ షో చేస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.

ఈ బ్యూటీ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించగా రాను రాను గ్లామర్ షో తో బాగా రెచ్చిపోతుంది.

గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.నిత్యం ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.

ఇక తనకు సంబంధించిన విషయాలను, సినిమా అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటుంది.తన పొట్టి పొట్టి డ్రెస్సులతో బికినీ అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తోంది.

ఈమె షేర్ చేసే వీడియోలు కానీ, ఫోటోలు కానీ తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

జాన్వీ కపూర్ చూడటానికి చాలా సైలెంట్ గా కనిపిస్తుంది. """/"/ కానీ ఆమె చేసే అల్లరి మాత్రం బాగా వైలెంట్ గా ఉంటుంది.

ముఖ్యంగా తన సోదరి ఖుషి కపూర్ తో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

ఖుషి కపూర్ కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.ఇక ఈమె సోషల్ మీడియా ఖాతాలలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె కూడా గతంలో చాలా హాట్ టాపిక్ గా మారింది.ఖుషి కూడా సోషల్ మీడియాలో తన అక్క మాదిరిగా హాట్ లుక్ లతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా జాన్వీ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే అందులో బోని కపూర్ నిర్మిస్తున్న 'మిలీ' అనే సినిమా కూడా ఒకటి.

అయితే ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ సినీ బృందం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉన్నారు.

"""/"/ దీంతో జాన్వీ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో పాల్గొనగా.అందులో తనకు తన డేటింగ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది.

అయితే తన చెల్లి ఖుషి కపూర్, ఈమె ఇద్దరు కలిసి ఒక బిజినెస్ మ్యాన్ అక్షత్ జైన్ తో ఒకరికి తెలియకుండా ఒకరు డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఇక అదే ప్రశ్న జాన్వీ కి ఎదురవటంతో.వెంటనే తను స్పందించింది.

తను కానీ, తన చెల్లె కానీ ఎవరితో డేటింగ్ చేయడం లేదు అంటూ.

తమ గురించి వచ్చే వార్తలను ఎవరు నమ్మకండి అంటూ.ఇలాంటి చెత్త రూమర్లపై తను కానీ, తన అభిమానులు కానీ స్పందించాల్సిన అవసరం లేదు అని.

దయచేసి ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దు అని తెలిపింది.ఇక తను నటించిన మిలీ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూద్దాం.

వైరల్: పిల్లి, కప్పతో పాము పోరాటం.. మామ్మూలుగా లేదుగా!