వాలంటీర్లపై జనసేనాని వ్యాఖ్యలు.. ఏపీలో చెలరేగిన దుమారం
TeluguStop.com
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై చేసిన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
దీంతో జనసేనానిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని, టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారనే వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
వారం రోజులకు ఒకసారి వారాహి యాత్రకు విరామం ఇచ్చి ఎక్కడెక్కడో స్క్రిప్ట్ తెచ్చుకుని చదువుతుంటారు పవన్.
అంతేకాదు ఎక్కడలేని హుషారుతో ఒంటి మీద సోయి కూడా మర్చిపోయి ఊగుతూ మాట్లాడుతున్నారట ఈ మధ్య.
అసలు ఆయన చెప్పే మాటలకు ఆధారాలు కానీ, బుుజువులు కానీ లేకుండా నోటికి ఏం వస్తే అదే మాట్లాడటంలో ఈ మధ్య పవన్ కల్యాణ్ ఓ బ్రాండ్ గా మారిపోయారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో కరోనా వంటి మహమ్మారి దాటికి యావత్ ప్రపంచం అతలాకుతలం అయిన విషయం అందరికీ తెలిసిందే.
అటువంటి క్లిష్ట సమయంలో ఏపీలోని వాలంటీర్లు చేసిన సేవలు నిరుపమానం.ఇంటింటికి తిరిగి కరోనా రోగులను గుర్తించడమే కాకుండా వారిని సేవలు చేస్తూ మందులు అందించిన ఘనత వారిది.
కరోనా కాటుకు బలికాకుండా ఎందరో ప్రాణాలను కాపాడిన సేవకులు వాలంటీర్లు.అందుకే కేరళ వంటి ఇతర రాష్ట్రాలు సైతం ఏపీ మోడల్ ను గుర్తించి తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో అధ్యయనాలు చేశారు.
కరోనా సోకి మరణిస్తే బంధుమిత్రులు సైతం పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాల్లోనూ మృతులకు అన్నీ తామే అయి అంత్యక్రియలు చేసిన వాలంటీర్ల సేవలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించే సారథులు ఈ వాలంటీర్లు.
అటువంటి వాలంటీర్ వ్యవస్థను అవమానపరుస్తూ వాలంటీర్లు అంటే నగదు ఎత్తుకెళ్లేవారిగా భావించిన పవన్ పై ఏపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుమారు రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పిన పవన్ కు సభ్యత, సంస్కారం గురించి ఒక్క లైన్ కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
అందుకే వాలంటీర్లలో 70 శాతం మహిళలే ఉన్నప్పటికీ వారి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడావంటూ మండిపడుతున్నారు.
గతంలో వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు.? వాలంటీర్లు అంటే కూలీలు, గోనె సంచులు మోసేవాళ్లంటూ హేళనగా మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు.
అయితే తరువాత బుద్ధి తెచ్చుకున్న ఆయన తమ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
చంద్రబాబు, లోకేశ్ కు ఉన్నపాటి సోయి కూడా లేకుండా ప్యాకేజీ స్టార్ వ్యవహరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి రావడం, విజయవంతంగా నడుస్తున్న సంస్థల మీద బురద జల్లడం, మళ్లీ సినిమా షూటింగ్ లకు వెళ్లడమే పవన్ దినచర్య అంటూ విమర్శిస్తున్నారు ప్రజలు.
అందుకే ప్రజలు గత ఎన్నికల్లో ఓడగొట్టి మూలన కూర్చొబెట్టారని అంటున్నారు.ప్యాకేజీ పెంచుకోవడం కోసం పవన్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మరని తెలుస్తోంది.
కాసేపు ఎమ్మెల్యే మరికాసేపు సీఎం అయిపోవాలని భావించే పవన్ కు ఈసారి కూడా ఓటమి తప్పదని కొందరు చెబుతున్నారు.
ఈ సారి కూడా ఎక్కడ పోటీ చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని నమ్మకంగా ఉన్నారు ప్రజలు.
డబ్బులు కావాలంటే చంద్రబాబుతో బేరాలు చేసుకోవాలని కానీ వాలంటీర్లతో అనవసరంగా పెట్టుకోవద్దంటూ కొన్ని హెచ్చరికలు సైతం వస్తున్నాయని తెలుస్తోంది.
ఏదీ ఏమైనా పవన్ ఇప్పటికైనా ఆలోచించి మాట్లాడాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం వల్ల ఏం అవుతుందో తెలుసా?