టీడీపీకి జనసేన భారీ స్ట్రోక్ !
TeluguStop.com
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది.
నిన్న మొన్నటి వరకు దోస్తీకి సై అన్న పార్టీలు ఇప్పుడు ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నాయి.
టీడీపీ జనసేన పార్టీ( JanaSena Party )ల మద్య పొత్తు దాదాపు కన్ఫర్మ్ అనుకున్నారంతా.
కానీ ఇంతవరకు పొత్తుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాక పోగా ఇంకా రెండు పార్టీల మద్య దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.
ఈ రెండు పార్టీల అధినేతలు ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనపై కూడా ఎవరికి వారు దృష్టి కెంద్రీకరించారు.
"""/" /
ఇదిలా ఉంచితే ఒకవేళ రెండు పార్టీల మద్య పొత్తు లేని పక్షంలో జనసేన పార్టీతో టీడీపీకి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీలోని అసంతృప్త నేతలు ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన వైపు చూస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.
ఇటీవల విజయనగరం టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ( Padala Aruna ) జనసేన గూటికి చేరారు.
అరుణ విజయనగరం జిల్లా గణపతిపురం నియోజికవర్గంలో టీడీపీ తరుపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలాంటి నాయకురాలు టీడీపీని వీడడం నిజంగా ఆ పార్టీకి గట్టి దేబ్బే అని చెప్పాలి.
ఇక పడాల అరుణ ఎంట్రీతో విజయనగరం జిల్లాలో జనసేన బలం పెంచుకునే అవకాశం ఉంది.
"""/" /
గణపతిపురం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ( TDP Party ) తరుపున బరిలోకి దిగిన ఆమె ఈసారి జనసేన తరుపున బరిలో దిగడం దాదాపు ఖాయమే.
ఇంకా మరికొంత మంది టీడీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చేరికల పరిణామాలు చూస్తుంటే టీడీపీ జనసేన మద్య పొత్తు దాదాపు లేనట్లేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఒకవేళ ఈ రెండు పార్టీల మద్య ఎలాంటి పొత్తు లేకపోతే వైసీపీ( YCP Party )కి ప్లెస్ అయ్యే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే టీడీపీ ఓటు బ్యాంక్ లో చీలిక ఏర్పడి జనసేన సెకండ్ ప్లేస్ లో నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో టీడీపీ జనసేన మద్య ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?