జనసేన హింసలో పాల్గొనదు..: నాదెండ్ల మనోహార్

జనసేన పార్టీ ఎప్పుడూ ఎటువంటి హింసలో పాల్గొనదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహార్ అన్నారు.

మేయర్ కావటి మనోహర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సుమోటో కేసులు పెట్టాలని సుప్రీంకోర్టే చెప్పిందని నాదెండ్ల పేర్కొన్నారు.

ఈ క్రమంలో మనోహర్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలన్నారు.153ఏ, 153 బి కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరుతున్నామని తెలిపారు.

లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.అదేవిధంగా ఏపీలో ఇసుక తవ్వకాలపై కూడా ఈడీ దర్యాప్తు కోరతామని తెలిపారు.

భర్తను అన్ ఫాలో చేసిన కలర్స్ స్వాతి…. మరోసారి  తెరపైకి  విడాకుల వార్తలు?