సంకీర్ణ రాజకీయాలను పరిచయం చేయబోతున్న జనసేన??

రాజకీయాలు పూర్తిస్థాయి కమర్షియల్ వ్యవహారం లాగా మారిపోయి చాలాకాలం అయ్యింది .డబ్బు కులాల సమీకరణాలు ,పొత్తు వ్యూహాలు ఇలా ఎన్నికలలో గెలుపు ఓటముల ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉండి సామాన్యులకు రాజకీయాన్ని దూరం చేస్తున్నాయి .

రాజకీయాలంటే మనకు సరిపడ ని వ్యవహారం అంటూ చాలామంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు కూడా పక్కకు తప్పుకుంటున్నారు .

ఇది పూర్తిస్థాయి యుద్ధంలా మారిపోయి చాలా సంవత్సరాలు అయింది.ఇలాంటి ఎన్నికల సమరంలో పోటీపడి గెలవాలంటే కష్టమని అర్థం చేసుకుంటున్న జనసేన( Jana Sena ) నయా రాజకీయానికి తెరతీసిందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంకీర్ణ ప్రభుత్వాల సరళిని తీసుకురాబోతుందని వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రం మొత్తం ఎన్నికలకి పోటీ పడడానికి అవసరమైనంత డబ్బు కానీ వనరులు కానీ లేనందున మిగతా రెండు పార్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడటం కష్టమని గత ఎన్నికల ఫలితాలతో గ్రహించిన జనసేన ఇప్పుడు రూట్ మార్చినట్లుగా కనిపిస్తుంది.

అభిమానుల ఆదరణ తప్ప విశేష ధన ప్రవాహం గాని వెనకనుంచి ఫం డింగ్ ఇచ్చే వ్యాపార వేత్తల బలం కానీ లేనందున పోటీ పడితే అభాసు పాలవడం అవడం తప్ప తనని నమ్ముకున్న వారిని కూడా సంతోష పెట్టాలేననే నిజాన్ని గ్రహించిన జనసేన ఈసారి 2024 ఎన్నికల వ్యూహాన్ని మార్చినట్లుగా కనబడుతుంది.

"""/" / తన బలం ఉన్న చోట మాత్రమే ఫోకస్ చేసి ఉన్న పరిమితమైన వనరులను ఆయా స్థానాలలోనే కేటాయించాలని, తద్వారా ఎవరికీ పూర్తి మెజారిటీ రాని ఒక వాతావరణాన్ని తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న జనసేనఅదినేత( Pawan Kalyan ) దానికి అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

విపరీతమైన సినీ షెడ్యూల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలపై( Godavari Districts ) ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ,తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే ఆయన 2024 ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం అవుతుంది .

"""/" / ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రత్యేక స్థానాలను, ఉభయగోదావరి జిల్లాలోని మేజరిటీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా జనసేన అభ్యర్థులు గెలిపించాలని, కీలకమైన స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ వ్యూహాలను పరిచయం చేయాలని పట్టుదలతో ఆయన ఉన్నట్లుగా కనబడుతుంది.

సొంత సినిమాలనే డైరెక్ట్ చేసుకుంటే వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.