ఈనెల 27న అమిత్ షా తో భేటీకానున్న జనసేనాని..?!
TeluguStop.com
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఈనెల 27న అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
పొత్తులపై బీజేపీ - జనసేన కసరత్తు జరిగే ఛాన్స్ ఉంది.తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించగా వాటిలో ఆరు నుంచి పది స్థానాలు ఇచ్చే యోచనలో బీజేపీ ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీకానున్నారని తెలుస్తోంది.