Devineni Uma : జనసేన – టీడీపీ అధికారంలోకి రావడం తథ్యం..: దేవినేని
TeluguStop.com
ఎన్టీఆర్ జిల్లా మైలవరం( Mylavaram ) అన్నేరావుపేటలో రెండో వారంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని టీడీపీ నేత దేవినేని ఉమ( Devineni Uma ) అన్నారు.
వంద కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని తెలిపారు.25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని పేర్కొన్నారు.
2014 లో ఆగర్భ శత్రువుల దగ్గరికి పంపినా పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిశానని తెలిపారు.
"""/" /
కేశినేని నాని,( Kesineni Nani ) వసంత కృష్ణప్రసాద్,( Vasantha Krishna Prasad ) సుజనా చౌదరి( Sujana Chowdary ) అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.
ఏ పార్టీలో అధికారంలో ఉన్నా వాళ్ల పనులు చేయించుకుంటున్నారని తెలిపారు.మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరని చెప్పారు.
ఎన్నికల తరువాత జైలుకైనా వెళ్తా లేదా చింతలపూడి కాలువలపై పడుకుంటానని తెలిపారు.రాష్ట్రంలో జనసేన - టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు.