జగన్ తిరుమల పర్యటన… జనసేన దూరం
TeluguStop.com
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి ఉపయోగించారని, దీనికి గత వైసిపి ప్రభుత్వం లోని పెద్దలే కారణం అని టిడిపి , జనసేన, బిజెపి కాంగ్రెస్ లు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, వైసిపి అధినేత జగన్( YS Jagan ) నేడు తిరుపతికి వస్తున్నారు .
రేపు ఉదయం తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకునేందుకు టిడిపి, బిజెపి, జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలకు దిగాలని ముందుగా నిర్ణయించుకున్నా, ఈ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగా డిక్లరేషన్( Declaration ) ఇచ్చి తీరాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉండడం, ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి , హిందూ సంఘాలు జగన్ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, పవన్ ఈ నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన శ్రేణులకు స్పష్టం చేశారు.
"""/" /
జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ( TTD ) చూసుకునే ప్రక్రియ.
జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సిన సమయం కాదు ఇది .
వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు. ఆ ప్రక్రియ పై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన , డిక్లరేషన్ అంశాలకు జనసేన నేతలు దూరంగా ఉండాలని పవన్ ఆదేశించారు.
పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.ఇక జగన్ తిరుమల పర్యటన రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది.
ఈరోజు సాయంత్రం 4.50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు.
"""/" /
ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తారు. రాత్రి 7 గంటలకు తిరుమల( Tirumala ) చేరుకుంటారు.
రేపు ఉదయం 10:30 కు తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు. జగన్ కు స్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
అయితే జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలని, లేదంటే అలిపిరి వస్తే అడ్డుకుంటామని బిజెపి హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి .
ఈ వ్యవహారం ఇలా ఉండగానే జగన్ పర్యటనకు జనసేన శ్రేణులు దూరంగా ఉండాలని పవన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు.
నాలో ఖాళీని శోభిత పూర్తి చేస్తుంది.. నాగచైతన్య కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!