రెండు రోజులలో జనసేన మొదటి అభ్యర్ధుల జాబితా రెడీ!

ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.మరో నెల రోజులు మాత్రమె ఎన్నికలకి సమయం వుంది.

ఈ నేపధ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు మూడు అభ్యర్ధులని ప్రకటించడంపై ద్రుష్టి సారించాయి.

ఇప్పటికే టీడీపీ మొదటి జాబితా అభ్యర్ధులని ప్రకటించడానికి రెడీ అయిపొయింది.ఇక వైసీపీ కూడా అదే పనిలో వుంది.

మొన్నటి వరకు అభ్యర్ధులకి స్క్రీనింగ్ చేసిన జనసేన టీం తుది జాబితాని పవన్ కళ్యాణ్ వద్దకి పంపించింది.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అభ్యర్ధుల ఎంపిక మీద కసరత్తు మొదలెట్టారు.ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.

ఈ ఎన్నికలలో అన్ని స్థానాలలో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన కచ్చితంగా గెలిచే స్థానాలపైన ముందుగా ద్రుష్టి పెట్టి వాటికి అభ్యర్ధులని ప్రకటించాలని నిర్ణయించుకుంది.

ఇందుకుగా మరో రెండు రోజుల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధుల మొదటి జాబితాని ప్రకటిస్తుంది అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న జనసేన, ఈ ఎన్నికలలో 60 స్థానాలని కచ్చితంగా గెలుచుకోగాలమనే ధీమాతో వున్నట్లు కనిపిస్తుంది.

ముందుగా వాటికి అభ్యర్ధులని జనసేనాని ప్రకటించే అవకాశం వుందని తెలుస్తుంది.

వారానికి 2 సార్లు ఉడికించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందొచ్చో తెలుసా?