చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం నేను.. పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఒకప్పుడు వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేన( Janasena ) కోసం పని చేస్తున్న పృథ్వీరాజ్( Prithviraj ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

పృథ్వీరాజ్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేను 2024 ఎన్నికల్లో పోటీ చెయ్యనని చంద్రబాబు, పవన్ వదిలిన బాణం నేనని పృథ్వీరాజ్ అన్నారు.

ఈ ఏడాది మార్చి నెలలో ఎన్నికల ప్రచారానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు.డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడే వాళ్లు మంత్రులా అని పృథ్వీరాజ్ ప్రశ్నించారు.

అంబటి రాంబాబుకు( Ambati Rambabu ) ప్రాజెక్ట్ ల గురించి తెలుసా అని ఆయన పేర్కొన్నారు.

అంబటి రాంబాబు ఎప్పుడూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మూడు పెళ్లిళ్ల గురించి, రెండు చోట్ల ఓటమి గురించి మాత్రమే మాట్లాడతారని ఆయన అన్నారు.

"""/" / లోకేశ్( Nara Lokesh ) వద్ద రెడ్ డైరీ ఉందని నా వద్ద పీఆర్ డైరీ ఉందని ఆ డైరీని బయటకు తీస్తానని పృథ్వీరాజ్ వెల్లడించారు.

పవన్ పెళ్లిళ్ల వల్ల అభివృద్ధి నిలిచిపోయిందా? పోలవరం ప్రాజెక్ట్( Polavaram Project ) ఆగిందా అని కామెంట్లు చేశారు.

మూడు రాజధానుల పేరు చెప్పి ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఆయన అన్నారు.

నా ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు.

"""/" / వైఎస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ వదిలిన బాణమని టీడీపీ, జనసేనలకు 136 ఎమ్మెల్యే స్థానాలు, 21 ఎంపీ స్థానాలు వస్తాయని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.

2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు అద్భుతంగా ఉండనుందని పృథ్వీరాజ్ వెల్లడించారు.పృత్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పృథ్వీరాజ్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

29 మంది చనిపోయిన సమయంలో చట్టం గుర్తుకు రాలేదా.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!