జనసేన పార్టీకి సినిమా వారి మద్దతు కోసం ప్రయత్నాలు.. పవన్‌ వ్యూహం ఏంటో?

జనసేన పార్టీని( Janasena ) అధికారంలోకి తీసుకు వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఒకే ఒక్క సీటు గెలిచిన విషయం తెల్సిందే.

పవన్( Pawan Kalyan ) రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందారు.

ఈసారి మాత్రం ఏకంగా కింగ్‌ అవ్వాలని లేదంటే కింగ్‌ మేకర్ అయినా అవ్వాలనే పట్టుదలతో జనసేనాని ఉన్నాడు.

ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్‌ యొక్క వ్యూహాత్మక అడుగులు ఏంటి అంటూ రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.

రేపటి నుండి వారాహి యాత్ర కు( Varahi ) పవన్ రెడీ అవుతున్న విషయం తెల్సిందే.

ముందస్తుగా యాగాలు.హోమాలు చేస్తున్నారు.

ఇందుకోసం పవన్‌ భారీగా ఖర్చు చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. """/" / ఆ విషయం పక్కన పెడితే తన సినిమాల నిర్మాతలను ఆ కార్యక్రమాలకు పిలిచి ఒకరు ఇద్దరికి పార్టీ కండువాలు కప్పి మరీ వారు తమ పార్టీ లో జాయిన్ అయ్యారు అంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అంతే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన చాలా మంది జనసేన పార్టీకి మద్దతుగా ఉంటున్నారు అంటూ కలరింగ్ ఇచ్చేందుకు పవన్ అలా చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / మొత్తానికి జనసేన పార్టీ లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ముందు ముందు చేరే అవకాశాలు ఉన్నాయేమో కానీ ప్రస్తుతానికి జనసేన పార్టీని ఇండస్ట్రీ వర్గాల వారు పట్టించుకోకుండా న్యూట్రల్‌ గా ఉండాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

జనసేన తో కలిస్తే వైకాపా ప్రభుత్వం తో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

అందుకే జనసేన పార్టీ కి దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది.వారిని పార్టీ లోకి తీసుకు వచ్చేందుకు పవన్‌ ఏం చేస్తాడో చూడాలి.

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యం లో ముందు ముందు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అశ్వనీదత్‌ సీనియర్ ఎన్టీఆర్‌ని కలవడానికి ఏం చేశారో తెలిస్తే షాకే..?