వచ్చే ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసేది ఎక్కడి నుండి?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2019 అసెంబ్లీ ఎన్నికల సమయం లో గాజువాక మరియు భీమవరం( Gajuwaka , Bhimavaram ) నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే.

పార్టీ అధినేత రెండు స్థానాల్లో పోటీ చేయడం కొత్తెం కాదు.గతంలో కొందరు రెండు స్థానాల్లో గెలుపొందారు.

కొందరు రెండు స్థానాల్లో ఓడి పోయారు, పవన్ కళ్యాణ్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయం లో రెండు స్థానాల నుండి కూడా ఓడి పోవడం జరిగింది.

పవన్ కళ్యాణ్ అంటే రెండు నియోజకవర్గాల్లో విపరీతమైన అభిమానం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ రెండు స్థానాల్లో పోటీ చేయడం వల్ల అక్కడ గెలుస్తారని ఇక్కడ వాళ్ళు ఇక్కడ గెలుస్తారని అక్కడ వాళ్ళు భావించి ఉండడంతో పవన్ కళ్యాణ్ ఓడి పోయాడేమో అనే ఒక వాదనను జనసేన పార్టీ ( Janasena Party )నాయకులు కార్యకర్తలు వినిపిస్తూ ఉంటారు.

గత ఎన్నికల ఫలితాన్ని గుణపాఠంగా తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సింగిల్ నియోజకవర్గం లోనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే ఆ ఒక్క నియోజకవర్గం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

"""/" / భీమవరం మరియు గాజువాక రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు మరియు నాయకులు తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే తమ నియోజక వర్గంలో పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అంతే కాకుండా వేరే జిల్లాల నియోజక వర్గాల నాయకులకు కూడా తమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడ పోటీ చేసినా కూడా గెలవడం ఖాయం.

అది ఒక చోట అయినా రెండు చోట్ల అయినా అవ్వచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా బీజేపీతో పాటు తెలుగు దేశం పార్టీతో ( Telugu Desam Party )కూడా జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

కనుక పవన్ కళ్యాణ్ విజయం అనేది నల్లేరు మీద నడక అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వైసీపీని అధికారానికి దూరం చేస్తానంటూ గట్టిగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోతే కచ్చితంగా ఈసారి ఆయనను రాజకీయాల్లోనే ఉండొద్దని విమర్శించే వారు ఉంటారు.

కనుక ఆయన ఈసారి పోటీ చేసే నియోజకవర్గంలో ఎక్కువ దృష్టి పెట్టి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది.

అదే జరిగితే పవన్ కళ్యాణ్ 2024 లో అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.

దేవర భైరా గ్లింప్స్ రివ్యూ.. క్రూరమైన విలన్ రోల్ లో సైఫ్ రోల్ లో అదరగొట్టాడుగా!