వాలంటీర్ల పై సానుభూతి ! మరికొన్ని ప్రశ్నలు సంధించిన పవన్
TeluguStop.com
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై( AP Volunteers ) మొదటి నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టిడిపి సైతం మొదట్లో వాలంటీర్ వ్యవస్థ పై అనేక విమర్శలు చేసింది.చివరకు టీడీపీ ప్రకటించిన మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటన కూడా చేసింది.
అయితే దీనికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు.
ముఖ్యంగా ఏపీలో ఉమెన్ ట్రాపింగ్ కు వాలంటీర్ లు ఇస్తున్న డేటానే కారణమని, ఇదే విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టి, పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండగా, పవన్ మాత్రం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసిపి ప్రభుత్వం ను టార్గెట్ చేశారు.
"""/" /
ఇప్పటికే రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు ఇచ్చింది.
పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని , అలా సమర్పించలేకపోతే క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
తాజాగా మరోసారి వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు.పార్టీ కార్యకర్తలు వీర మహిళలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పవన్ మీకు ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారంటున్నారు.
వారి డేటా ఎస్పీ ఆఫీసు ,కలెక్టర్ ఆఫీసుల్లో ఉండాలి.వాలంటీర్ల పేరుతో యువత జీవితాన్ని వైసిపి ప్రభుత్వం( YCP ) నాశనం చేస్తుంది .
కేవలం 5000 రూపాయల వేతనాన్ని ఇచ్చి పెట్టి చాకిరి చేయించుకుంటుంది ఎవరు అంటూ పవన్ ప్రశ్నించారు.
ఒకవైపు వాలంటీర్ విమర్శలు చేస్తూనే, మరోవైపు వారి సానుభూతిని పొందేందుకు పవన్ ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది.
"""/" /
ఇక ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పవన్ అనేక ప్రశ్నలు సంధించారు.
5000 రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటుంది ఎవరు ? , నాలుగేళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా, ఐదువేల జీతానికి ఊడిగం చేయిస్తూ, బ్రతుకులు నాశనం చేసింది ఎవరు ? వలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయసు అర్హతతో నాలుగేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు ? పథకాల చేరవేత అని చెప్పి మీ చేత ప్రజల డేటా సేకరిస్తుంది ఎవరు ? మీ చేత డేటా సేకరించి దానిని ఆసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంది ఎవరు ? మీ జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా చేసి ఐదువేల దగ్గరే ఉంచింది ఎవరు ? అంటూ పవన్ ప్రశ్నించారు.
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కి హార్ట్ ఎటాక్.. వీడియో చూస్తే షాకే..