జగన్ కు సింపతి పెంచేస్తున్న పవన్?

తన వారాహి యాత్ర( Varahi Yatra )తో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విమర్శల ద్వారా అధికార పక్షానికి సింపతి పెంచేస్తున్నారు అంటూ కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ముఖ్యంగా కేంద్రం అండ తీసుకొని జగన్ ఆటాడిస్తా లాంటి కామెంట్లు కొన్ని వర్గాలకు పై జగన్కు సింపతి ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా కేంద్రంలో భాజాపా పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్న వర్గాలు కొన్ని ఉన్నాయి.

అవి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్( Vote Bank ) గా కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలు వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు గా ఉన్నాయి .

"""/"/ అయితే జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం , మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లు తగ్గించడం వంటి రాష్ట్ర ప్రబుత్వ నిర్ణయాలతో ఆయా వర్గాలలో చీలిక ఏర్పడి కొంత మంది జగన్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తున్నప్పటికీ జగన్( YS Jagan ) పై కేంద్రం వ్యతిరేక చర్యలు తీసుకుంటే మాత్రం ఆ వర్గాలు మళ్ళీ జగన్కు అనుకూలంగా మారే అవకాశం ఉందని, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతతో దూరం అవుతున్న వర్గాలను పవన్( Pawan Kalyan ) తన వ్యాఖ్యలతో తిరిగి వైసిపికి దగ్గర చేస్తున్నారని ,జగన్ కి సింపతి కలిగేందుకే పవన్ వారాహి యాత్రలు చేస్తున్నట్లుగా ఉందంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ జగన్ ను ఓడించి తీరుతానని జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రానివ్వనంటూ చేస్తున్న శపదాలు జగన్ పట్ల తటస్థంగా ఉండే వర్గాలకు జగన్ను మళ్ళీ గెలిపించాలని పట్టుదల పెరిగేలా చేస్తుందని, పవన్ జగన్ ను ఎంత ద్వేషిస్తే జగన్ పై ఆయా వర్గాల అభిమానం అంతగా పెరుగుతుందంటూ ఈ పరిశీలకులు విశ్లేషణ చేస్తున్నారు .

తాము గెలిస్తే చేయబోయే అభివృద్ధిని వివరించకుండా ఎంతసేపూ జగన్ ను తరిమికొడతాం లాంటి వ్యాఖ్యల ద్వారా వైసిపి ప్రయోజనానికే పవన్ పని చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్న దరిమిలా జనసేన వ్యూహాత్మ కమిటీ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి .

చిన్నారి డాన్స్‭కు ఫిదా అయినా హీరోయిన్.. వీడియో వైరల్