జగన్ విమర్శలపై జనసేన ప్రెస్ నోట్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం పై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై ఒంగోలు సభలో సీఎం జగన్ స్పందించి ప్రతి విమర్శలు చేసారు.

పవన్ కళ్యాణ్ గారు మీ ఐదుగురు పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారు అంటూ జగన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది.జగన్ కావాలని పవన్ వ్యక్తిగత జీవితంపైనా ఏపీ సీఎం వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకులు ఆరోపణలు చేస్తుండడంతో ఆ పార్టీ తరపున ప్రెస్ నోట్ విడుదల చేశారు.

దయచేసి నాయకులు ఎవరూ కంగారుపడవద్దని, సమన్వయం పాటించాలని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఆ ప్రకటనలో వ్యాఖ్యలు ఓ సారి పరిశీలిస్తే ఏపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యక్తిగత ఆరోపణలపై మన పార్టీ నాయకులు గాని, జనసైనికులు కానీ స్పందించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.

భవన నిర్మాణ కార్మికుల కోసం మనం చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నాము.

మన అధ్యక్షులు ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రిగారు చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ ప్రజా క్షేమం కోసం మనం భరిద్దామని శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు చెప్పారు.

మంగళవారం పవన్‌ కళ్యాణ్‌ విజయవాడ వస్తున్నారు.ఆ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అన్నిటికి బదులిస్తారు.

దయచేసి పార్టీ శ్రేణులు సమన్వయం పాటించాలని కోరుతున్నాను అంటూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేసారు.

ఎవరికి ఓటు వేయాలో ప్రజలే తేల్చుకోవాలి..: సీఎం జగన్