వైసీపీ ప్రభుత్వం కడుతుంది మూడు రాజధానులు కాదు.. మూడు రాజప్రాసాదాలు - జనసేన పోతిన మహేష్

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కడుతోంది మూడు రాజధానుల కాదని, మూడు రాజధానుల ముసుగులో మూడు రాజప్రాసాదాల నిర్మాణం చేపడుతోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు.

వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి గారి సన్నిహితుల ఆర్ధిక ప్రయోజనాల కోసమే విశాఖను ఆర్దిక రాజధానిగా ప్రకటించారన్నారు.

అమరావతి రైతుల పోరాటానికి యావత్ ఆంద్రప్రదేశ్ ప్రజానీకం మద్దతు లభించిందని, అది చూసే విశాఖలో గర్జనలు అంటూ వైసీపీ నాయకులు ఊగుతున్నారని స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, శ్రీ జగన్ రెడ్డి చెత్త పాలన గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే.

సమాధానం చెప్పాల్సింది పోయి మంత్రులు ఇష్టారీతిన మాట్లాడడాన్ని తప్పుబట్టారు.మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ పోతిన మహేష్ మాట్లాడుతూ "శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం అంటే అభివృద్ధికి కాదు.

కూల్చివేతలకు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కడుతోంది మూడు రాజధానులు కాదు.

మూడు రాజప్రాసాదాలు.ఇప్పటికే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టారు.

ముఖ్యమంత్రి గారి భార్య శ్రీమతి భారతి గారి కోసం విశాఖ రుషి కొండలో మరో ప్యాలెస్.

మూడో ప్యాలెస్ రాయలసీమలో కట్టే ప్రయత్నం చేస్తున్నారు.మూడు రాజధానుల ముసుగులో మూడు రాజ ప్రాసాదాల నిర్మాణం జరుగుతోంది.

దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలి.విశాఖలో రాజధాని పెట్టే ముందు శ్రీ జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు తెచ్చిన ప్రాజెక్టులేంటో ప్రజలకు చెప్పాలి.

ఉత్తరాంధ్ర నాయకులు చూస్తే.ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు.

వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా? విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి, స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడరు.

ఉత్తరాంధ్ర వలసల గురించి మాట్లాడరు.ఏం మాట్లాడని మీరు ఉత్తరాంద్ర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో.

ప్రజలకు సమాధానం చెప్పాలి.మాట్లాడితే విశాఖపట్నం ఆర్ధిక రాజధాని అని చెబుతున్నారు.

విశాఖ కేవలం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జగన్ రెడ్డి గారి సొంత కోటరికి మాత్రమే ఆర్ధిక రాజధాని.

అధికారంలోకి రాగానే సింహాచలం భూములు కొట్టేసే ప్రయత్నం చేశారు.ఇవాళ దసపల్లా భూములు, రుషికొండ, విశాఖ చుట్టూ ఉండే ప్రభుత్వ భూములను ఇష్టానుసారం కబ్జా చేస్తున్నారు.

ఇవన్నీ వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి గారి సన్నిహిత వర్గం కోసం.ఈ నాయకులు ఇష్టానుసారం దోచుకోవడం కోసం.

H3 Class=subheader-styleదమ్ముంటే కేంద్రం ముందు గర్జించండి/h3p వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఇటుక పేర్చారా? ఒక బస్తా సిమెంటు కలిపి నిర్మాణం చేపట్టారా? వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి.

వైసీపీ నాయకులు మియ్యావ్.మియ్యావ్ అనడం కాదు.

దమ్ముంటే కేంద్రంలో బీజేపీ ముందుకు వెళ్లి గర్జించాలి.ప్రత్యేక హోదా కావాలి.

రైల్వే జోన్ కావాలి.వెనుకబడిన జిల్లాలకు ఆర్ధిక ప్రోత్సాహం కావాలి.

రాజధాని నిర్మాణానికి డబ్బులు కావాలని ప్లకార్డులు పట్టుకోండి చాలు.ఆ దమ్ము ధైర్యం లేని మీకు ఈ గర్జనలు ఎందుకు? మీకు నిజంగా పౌరుషం, దమ్ము, ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని అడగండి.

ఇవేమీ మాట్లాడని మీరు ఏం గర్జిస్తారు? H3 Class=subheader-styleపులిరాజా అమర్ నాథ్ మంత్రిగా చేసిందేంటో చెప్పాలి/h3p మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతారు.

వీరికి మంత్రి పదవులు ఇచ్చింది దేనికో అర్ధం కాదు.శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, ఇష్టానుసారం నోటికి వచ్చింది మాట్లాడడానికి మినహా వీరికి వేరే పని లేదు.

వీరు చేయాల్సిన పనులన్నీ సకలశాఖల మంత్రి శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి చూసుకుంటారు.

వీరేమో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలకు పరిమితం అవుతారు.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు.

ఇసుక ఇష్టానుసారంగా దోచేస్తున్నారు.మద్యం ఏరులై పారుతోంది.

ప్రభుత్వ బడులు మూసేశారు.ఉత్తరాంధ్ర నుంచి వలసలు కొనసాగుతున్నాయి.

వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు.ఈ విధమైన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకుల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతో దూరం లేవని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.

మంత్రులు ఒకరు బ్యాగు వేసుకుని ట్విట్టర్ లో ఫోటోలు పెడతారు.ఏం పీకారని ట్విట్టర్లో ఫోటోలు.

ఇంకోకరు సూటు బూటు వేసుకుని ఫోటోలు.ఇంకొకరు పర్యాటక శాఖకే కొత్త అర్ధం చెప్పిన మంత్రి.

వీళ్ళా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది.మీ జాతకాలు రాష్ట్ర ప్రజలకు తెలియవా? మీకు దమ్ముంటే కేంద్రం ముందు గర్జించండి.

ప్రత్యేక హోదా తెస్తాం.రైల్వే జోన్ తెస్తాం.

వెనుకబడిన జిల్లాలకు ఆర్ధిక ప్యాకేజీ కేంద్రం ముక్కు పిండి సాధిస్తాం అని గర్జించండి.

రాష్ట్రానికి ఎన్నివేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు.ఎన్ని ఉద్యోగాలకు రూపకల్పన చేశారు.

ఏ ఏ పరిశ్రమలు తెచ్చారో పులిరాజా గుడివాడ అమర్నాథ్ చెప్పగలరా? మీరు మంత్రి అయ్యాక రాష్ట్రానికి చేసిందేంటో చెప్పాలని సవాలు విసురుతున్నాం.

మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి విశాఖ బీచ్ లో ఫోటో షూట్లు మినహా చేసిందేమైనా ఉందా? సినిమాల్లో కామెడీ రోల్స్ కోసం ఫోటో షూట్ చేసుకుంటున్న అతనికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే స్థాయి ఉందా? దమ్ముంటే విశాఖకు తెచ్చిన ఒక్క పరిశ్రమ, వేసిన రోడ్డు, స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటం గురించి చెప్పు.

రికార్డింగ్ డాన్సులు వేసుకునే నువ్వు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు.

H3 Class=subheader-styleపదే పదే తిరుమల వెళ్ళేది భక్తితో కాదు/h3p తిరుమలలో రాజకీయాలు మాట్లాడరాదన్న నిబంధన తుంగలో తొక్కి తిరుమలలో జబర్ధస్త్ షోలాగా వెకిలి నవ్వులు.

వెకిలి చేష్టలతో మంత్రి రోజా కామెంట్లు చేస్తారు.ప్రతి 15 రోజులకి ఒకసారి తిరుమల వెళ్లి 30 మందికి ప్రోటోకాల్ దర్శనం చేయించడం.

బయటకు వచ్చాక వారి నుంచి చిల్లర వసూలు చేయడం ఆమె పనిగా పెట్టుకున్నారు.

లేకపోతే 15 రోజులకోసారి అంత మందితో ప్రోటోకాల్ దర్శనం ఎందుకు? ఒక్కోక్కరి నుంచి ఎంత వసూలు చేస్తున్నారు.

ఆమెకు ఇచ్చిన శాఖ ఏంటో ఆమెకే తెలియదు.విశాఖలో క్రూయిస్ కి అనుమతి ఇవ్వగానే రోజా ఇంటికి బెంజ్ కారు తాళాలు వెళ్ళాయానే మాటకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు.

మీరు బెంజికారు తీసుకున్నారా? లేదా? సమాధానం చెప్పండి.పర్యాటక మంత్రిగా రోజా గారి ఆధ్వర్యంలో రుషికొండ విధ్వంసం జరగుతోంది.

రుషికొండకు మీరు బోడిగుండు కొట్టించారా లేదా? మీకు పంపిన దస్త్రం మీద సంతకం పెట్టడం.

చిల్లర తీసుకోవడం.శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇదేనా మీ డ్యూటీ.

పర్యావరణాన్ని రక్షించాల్సింది పోయి ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఇంకా మాట్లాడుతారా? H3 Class=subheader-styleరోజా బయోపిక్ తీస్తే.

/h3p రాష్ట్ర పర్యాటక మంత్రి రోజా గారి బయోపిక్ తీస్తే సెన్సార్ కూడా అవదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

మీ లీలలన్నీ బయటకు వస్తాయి.మీ మంత్రిత్వ శాఖకు మీరు న్యాయం గా పని చేయండి.

శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు.అమరావతి ఉద్యమం మరో స్వతంత్ర ఉద్యమం లాంటిది.

అమరావతి రైతుల మీద ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా, కేసులు పెట్టినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో వారు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలు ఆమోదం తెలిపారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల త్యాగాన్ని గుర్తించి అమరావతికి మద్దతు ప్రకటించారు.

ఊరూరా జనసేన శ్రేణులు వారికి అండగా నిలబడుతున్నారు.ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రతిఘటన తప్పదు" అన్నారు.