జనతా కర్ఫ్యూకు జై కొట్టిన పవన్

ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అందరికీ తెలిసిందే.

ఈ వైరస్ బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు వహించాలని పలువురు సెలెబ్రిటీలతో కూడా అవగాహన కలిపిస్తోంది.

అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో ప్రధాని మెదీ ఇచ్చిన పిలుపు మేరకు పలు రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేస్తున్నాయి.

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ కూడా మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూకు తన పూర్తి మద్దతును ప్రకటించాడు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోందని, రోజురోజుకూ దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపాడు.

ఈ కరోనా వైరస్ బారిన పడకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

అలాగే దేశ ప్రజలు 22వ తేదీన ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తమ ఇళ్లకే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, ప్రభుత్వ అధికారులు చేస్తున్న కృషికి ప్రజలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు వారి ఇళ్లల్లోని బాల్కనీలో నిలబడి కరతాల ధ్వనితో వారికి సామాజిక సంఘీభావం తెలపాలని పవన్ కోరారు.

అటు టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీకి చెందని 24 క్రాఫ్ట్స్ కూడా మోదీ చేసిన సూచనలను పాటించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

1980లో అమెరికాకి వలస వెళ్లిన భారతీయ మహిళ.. ఇప్పుడు ఎలా ఉందంటే..