అదే జరిగింది : జనసేనకు ఆయన కూడా గుడ్ బై చెప్పేశాడు
TeluguStop.com
మొన్నటి ఎన్నికలో ఘోర పరాభవం పాలయిన జనసేనకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా గెలవక పోడంతో ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా నమ్మకం కోల్పోతున్నారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో సీనియర్ నాయకులు అంతా మెల్ల మెల్లగా జారుకుంటున్నారు.
ఇప్పటికే రావెల కిషోర్ బాబు, అద్దెపల్లి శ్రీధర్, డెవిడ్ రాజు ఇంకా కొందరు నాయకులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.
తాజాగా వారి దారిలోనే రాజమండ్రి సీనియర్ జనసేన నాయకుడు ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరం ఉంటున్నారు.ఆయన్ను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నించినా కూడా ఆయన మాత్రం దూరంగానే ఉంటూ వచ్చాడు.
దాంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు.
అనుకున్నట్లుగానే అదే జరిగింది.నేడు ఆయన తన పార్టీ ప్రాధమిక సభ్యత్వంకు మరియు ఇతర పార్టీ పదవులన్నింటికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశాడు.
ఆ లేఖలో కేవలం రాజీనామా చేస్తున్నట్లుగానే పేర్కొన్నాడు మినహా కారణం ఏంటీ, పార్టీ పరిస్థితి ఏంటీ అనే విషయాలపై ఆయన స్పందించలేదు.
తండేల్ విషయంలో భారీ రిస్క్ తీసుకున్న నిర్మాతలు.. చైతన్య సాయిపల్లవి ఏం చేస్తారో?