ఆ ఎమ్మెల్యే వైసీపీకి దగ్గరగానూ జనసేనకు దూరంగానూ

అధికార పార్టీ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాటు బిజెపి అండదండలు కూడా పవన్ కు పరోక్షంగా ఉండడంతో ఆయన దూకుడుకు అడ్డే లేదు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది.

జనసేన పార్టీలోనూ కొత్త రకమైన ఉత్సాహం కనిపిస్తోంది.గతం కంటే పార్టీలో ఇప్పుడు పుంజుకున్నట్టు కనిపిస్తున్నా పవన్ లో మాత్రం ఆ సంతోషం పెద్దగా కనిపించడం లేదు.

దీనికి కారణం ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కారణంగా కనిపిస్తోంది.

జనసేన పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెందినా ఆ పార్టీ పరువు కాపాడేందుకు అన్నట్టుగా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు .

ఇక ఆ ఒక్క ఎమ్మెల్యేతో తుని పవన్ అసెంబ్లీలో అధికార పార్టీ మీద యుద్ధం చేయాలని అనుకున్నారు.

"""/"/కానీ గెలిచిన తర్వాత దగ్గర నుంచి రాపాక వైఖరి ఏంటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

ఆయన వైసీపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కానీ ఎక్కడా జనసేన కు వ్యతిరేకంగా గాని, పవన్ ను దిక్కరించడం కానీ చేయడంలేదు.

ఒకపక్క జగన్ పై ఏ అంశాల మీద అయితే పవన్ విమర్శలు చేస్తున్నాడో అదే అంశాలను ప్రస్తావిస్తూ రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

ఇదే పవన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.కానీ ఆ ఆగ్రహాన్ని ఎక్కడా పవన్ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం ఓ పెట్టీ కేసులో రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగాన్ని వైసీపీ ప్రభుత్వం దించింది.

అయితే ఆయన్ను అరెస్టు చేస్తే తాను రోడ్డెక్కి పోరాడుతానని పవన్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

"""/"/ఆ తరువాత కొద్దిరోజుల పాటు రాపాక జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.

కానీ ఆ తర్వాత ఓ సందర్భంలో వై సి పి మంత్రితో కలిసి జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం సృష్టించారు.

జగన్ ఇస్తున్న హామీలు గతంలోనూ ఆ తరువాత ఎవరూ అమలు చేయలేదని, జగన్ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడంటూ రాపాక ప్రశంసల వర్షం కురిపించారు.

అసెంబ్లీలోనూ అనేకసార్లు జగన్ ను పొగిడారు.తాజాగా నిన్న అసెంబ్లీలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ జగన్ పై ప్రశంసలు కురిపించారు.

అయితే ఇదే విషయంలో పవన్ పెద్ద ఎత్తున ఆందోళన కూడా గతంలో చేశారు.

మన నుడి మనం గుడి అనే పేరుతో ఉద్యమమే స్టార్ట్ చేశారు.ప్రస్తుతం రాపాక వైసీపీకి దగ్గర గాను జనసేన కు దూరంగానే ఉంటూ చేస్తున్న రాజకీయం పవన్ కు మింగుడు పడడం లేదు.

రంగంలోకి నందమూరి బ్రదర్ .. నేటి  నుంచే ఎన్నికల ప్రచారం