జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి…  సీరియస్ తీసుకున్న పవన్ 

జనసేన ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి ఘటన సంచలనంగా మారింది.ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు( Janasena MLA Chirri Balaraju ) వాహనంపై కొంతమంది ఆగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఈ రాళ్ల దాడి లో ఎమ్మెల్యే కారు( MLA Car ) వెనుక భాగం ధ్వంసం అయింది .

కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి.  ఎమ్మెల్యే బాలరాజు నిన్న రాత్రి బర్రెలంకలపాడు నుంచి జీలుగుమిల్లి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.ఈ దాడి వ్యవహారం తర్వాత ఎమ్మెల్యే బాలరాజు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

రాళ్ల దాడి జరిగిన సమయంలో తాను కారులో లేను అని , తాను సురక్షితంగానే ఉన్నానని,  నియోజకవర్గంలోని ప్రజలు ,అభిమానులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని బాలరాజు కోరారు.

"""/" / ఇక ఈ రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే బాలరాజు కోరారు.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఎలా ఉంటే జనసేన ఎమ్మెల్యే బాలరాజు కారుపై రాళ్ల దాడి సంఘటనపై జనసేన అధినేత,  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీవ్రంగా స్పందించారు .

రాళ్ల దాడి వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు.దాడి సమయంలో బాలరాజు కారులో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని , ఈ ఘటనకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని ,వీలైనంత తొందరగా వారిని పట్టుకోవాలని పోలీసులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఇటువంటి దాడులకు దిగడం దారుణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. """/" / ఇది ఇలా ఉంటే నిన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుదిలా మాస్కు ధరించి కోటా రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీ కి వెళ్లారు.

అప్పుడు ఆఫీసు ఉద్యోగి సాయికుమార్ పని వదిలేసి ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్న విషయాన్ని ఎమ్మెల్యే బాలరాజు గుర్తించారు.

వెంటనే ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,  సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

జగన్ అరెస్ట్ కు షర్మిల డిమాండ్ .. వైసీపీ కౌంటర్ ఇదే