కీల‌క సీటుపై క‌న్నేసిన జ‌నసేన‌.. ప్లాన్ వ‌ర్కౌట్ అయ్యేనా..?

జ‌న‌సేన ఇప్పుడు ఏపీలో బ‌లంగానే ఎదుగుతున్న పార్టీ.ఏ పార్టీకి లేనంత క‌మిట్ మెంట్ ఉన్న కేడ‌ర్ కేవ‌లం జ‌న‌సేన‌కు మాత్ర‌మే ఉన్నారు.

ఇందుకు కార‌ణం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ట్రాట‌జీ.మొద‌టి నుంచి జ‌న‌సేన‌ను న‌మ్ముకుని ప‌నిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

ప‌దవులు లేక‌పోయినా అంత క‌మిట్ మెంట్ తో ప‌నిచేస్తున్నారు కాబ‌ట్టే ఇంకా ఉనికి చాటుతోంది.

కాగా ఈ సారి విశాఖ జిల్లాలో జ‌న‌సేన రాజ‌కీయంగా ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఈ జిల్లాలో జ‌న‌సేన‌కు కేడ‌ర్ బ‌లంగానే ఉన్నారు.అందుకే వారి హ‌వా చూపిస్తున్నారు.

విశాఖ జిల్లాలో 2019 ఎన్నిక‌ల్లో సౌత్ టు నార్త్ అన్న‌ట్టు అంత‌టా బాగానే ఓట్లు తెచ్చుకుంది.

కాబ‌ట్టి ఈ ఓటు బ్యాంకును ఉప‌యోగించుకునేందుకు జ‌న‌సేన రెడీ అయిపోయింది.ఇప్పుడు టీడీపీలో గెలిచిన వారంతా వైసీపీలోకి వెల్లిపోయారు.

కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాత్రం తాను గెలిచిన‌ప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోకుండా అలాగే వ‌దిలేశారు.

ఎలాగూ సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు దారులు బాగానే ఉన్నారు.దీంతో ఇక్క‌డ జ‌న‌సైనికులు మాత్రం బ‌లంగా ప‌నిచేసేందుకు రెడీ అవుతున్నారు.

"""/" / సిటీలో టీడీపీ త‌ర్వాత జ‌న‌సేన‌కు మంచి బ‌ల‌ముంది.ఇక్క‌డ వైసీపీ కంటే కూడా జ‌న‌సేన చాలా యాక్టివ్ గా ప‌నిచేస్తోంది.

కాబ‌ట్టి రాబోయే ఎన్నిక‌ల్లో ఒక‌వేళ పొత్తులు ఉన్నా స‌రే టికెట్ మాత్రం తామే ద‌క్కించుకోవాల‌నే త‌ప‌న‌తో జ‌నసైనికులు చురుగ్గా ప‌నిచేస్తున్నారంట‌.

ఇక టీడీపీలో ఉన్న సెకండ్ గ్రేడ్ నాయ‌కులు కూడా జ‌న‌సేన వైపు చూస్తున్నారు కాబ‌ట్టి ఎలాగైనా వారిని తీసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గంటా స్థానంలో జ‌నసేన జెండా ఎగ‌రేయాల‌ని భావిస్తున్నారు జ‌న‌సైనికులు.

కానీ ఇదంతా కూడా చాలా సైలెంట్ గానే జ‌రుగుతోంది.మ‌రి దీన్ని గంటా శ్రీనివాస్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

వరస గా ఫ్లాప్ సినిమాలు.. రూటు మార్చిన నాగార్జున.. మామూలు తెలివి కాదు కదా